Telangana Cabinet : త్వరలోనే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరిగేే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నప్పటికీ, వాటిలో నాలుగు మాత్రమే ఇప్పుడు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మిగతా రెండు మంత్రి పదవుల్లో ఒకదాన్ని మైనారిటీల కోసం, మరోదాన్ని పార్టీ ప్రాధాన్యమిచ్చే నాయకులకు కేటాయించేందుకు పక్కన పెడుతున్నట్లు సమాచారం. ఇక నాలుగు మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రి పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కూడా ఈ పోటీలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
మంత్రి పదవులు(Telangana Cabinet) ఆశించి భంగపడే ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఆర్టీసీ, పౌర సరఫరాలు, మూసీ డెవలెప్‌మెంట్ అథారిటీ వంటివి వారికి కేటాయించి, ఆయా విభాగాలకు క్యాబినెట్ హోదా కల్పించే అవకాశం ఉంది. ఏఐసీసీ స్థాయిలో సీఎం రేవంత్ చర్చించిన తర్వాతే ఈ పదవుల భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకోగానే మంత్రి పదవుల భర్తీకి సంబంధించిన కసరత్తు వేగవంతం అవుతుందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు (బుధవారం) హైదరాబాద్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొంటారు. ఈ నెల 16న రాష్ట్ర పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తారు. ఈ నెల 17న లేదంటే 18న ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో భేటీ అయి మంత్రి పదవుల కేటాయింపుపై చర్చించే అవకాశం ఉంది.
Also Read :Jogiramesh : మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అవకాశాలు కల్పించడంలో సామాజిక సమతుల్యతను పాటించేందుకు పీసీసీ అధ్యక్ష పదవితోపాటు నాలుగు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవులను త్వరగానే భర్తీ చేయనున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎంపీ బలరాం నాయక్, సంపత్ కుమార్, మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పోటీపడుతున్నారు. వీరిలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించే అవకాశం ఉందట. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని అంచనా వేస్తున్నారు.