G. V. Prasad: అంజిరెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ, ఫార్మాను కొత్త పుంతలు తొక్కిస్తూ!

డాక్టర్ రెడ్డీస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీనీ రేసుగుర్రంలా పరుగులు పెట్టించారు జీవీ ప్రసాద్

  • Written By:
  • Updated On - June 5, 2023 / 01:27 PM IST

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (Dr. Reddy’s Laboratories).. ఇప్పుడొక బహుళజాతి ఔషధ సంస్థ. ప్రస్తుతం ఈ సంస్థ భారతదేశంతోపాటు ఇతర దేశాల్లోనూ విస్తృతమైన ఔషధాలను తయారు చేసి మార్కెట్ చేస్తుంది. కంపెనీ 190 రకాలకు చెందిన మందులు, ఔషధ తయారీరంగానికి అవసరమైన 60 యాక్టివ్ ఫార్మాస్యూటికల్ (క్రియాశీల) పదార్థాలు (ఎపిఐలు), డయాగ్నొస్టిక్ కిట్లు, క్రిటికల్ కేర్, బయోటెక్నాలజీ ఉత్పత్తులు తయారుచేస్తూ ఫార్మ రంగంపై తనదైన ముద్ర వేస్తోంది. అంతేకాదు.. జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలను చురుగ్గా నిర్వహిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ఫార్మా రంగంపై రెడ్డీస్ ల్యాబ్ బలమైన ముద్ర వేయడానికి ప్రధాన కారణం.. జీవీ ప్రసాద్. డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీనీ రేసుగుర్రంలా పరుగులు పెట్టించారు. ఓ మధ్య తరగతి కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దిదారు. వినూత్న ఆలోచనలు, అంకితభావం, నైతిక విలువలు పాటించి రెడ్డీస్ ల్యాబ్ ను అత్యుతన్న శిఖరాలకు చేర్చారు. శాస్త్రీయ పరిశోధనలు, అత్యున్నత విలువలకు మారుపేరుగా నిలిచారు. ఇన్ని ఘనతలు సాధించిన జీవీ ప్రసాద్ (G. V. Prasad) మరొవరో కాదు.. ఫౌండర్ అంజిరెడ్డి అల్లుడు కూడా.

రెడ్డీస్ ల్యాబ్ పై జీవీ ముద్ర

G.V. ప్రసాద్ కు చిన్నప్పట్నుంచే తెలివైన విద్యార్థి. చదువుతోపాటు ఇతర రంగాలపై ద్రుష్టి పెట్టేవారు. తండ్రి ప్రోత్సాహంతో అలగప్ప కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత చికాగోలో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1982లో అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిస్ట్స్, చికాగో చాప్టర్ నుండి ‘అత్యుత్తమ సీనియర్ విద్యార్థి’ అవార్డును గెలుచుకున్నాడు. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత జీవీ ప్రసాద్ భారతదేశానికి తిరిగి వచ్చి తన తండ్రి నిర్మాణ వ్యాపారంలో చేరాడు. కర్ణాటకలో వివిధ ప్రాజెక్టులలో మునిగిపోయాడు. ఫార్మ రంగంపై ఆసక్తితో జీవీ ప్రసాద్ 1985లో బెంజెక్స్ ల్యాబ్స్ ను ఫార్మాస్యూటికల్ సంస్థతో కలిసి స్థాపించాడు. ఆ తర్వాత జరిగిన పరిణామా వల్ల బెంజెక్స్‌ను డాక్టర్ రెడ్డీస్ కొనుగోలు చేసింది. అయితే ఆ ల్యాబ్ డా. రెడ్డీస్ లాబొరేటరీస్‌తో విలీనం చేయడంతో జీవీ ప్రసాద్ ఛైర్మన్, CEOగా బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్ డా. రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు కల్లం అంజి రెడ్డి కుమార్తె అనురాధను వివాహం చేసుకున్నాడు. అనురాధ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ. భారతదేశ సంప్రదాయాలు సంస్కృతిని ప్రోత్సహించే సంస్థ అయిన సప్తపర్ణి వ్యవస్థాపక-డైరెక్టర్

లోకల్ టు గ్లోబల్

రెడ్డీస్ ల్యాబ్స్ అంతర్జాతీయ మొట్టమొదటి విస్తరణ 1992 లో రష్యా (Russia)తో మొదలుపెట్టింది. అక్కడ డాక్టర్ రెడ్డి దేశంలోని అతిపెద్ద ఔషధ ఉత్పత్తిదారుల బయోమెడ్‌తో (జీవవైద్య శాస్త్రవేత్తల బృందం) జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రష్యాలో రెండు సూత్రీకరణ యూనిట్లను నెలకొల్పింది.రెడ్డి లాబొరేటరీస్, బల్క్ ఔషధాలను ఈ సూత్రీకరణ యూనిట్లకు ఎగుమతి చేసేది. తరువాత వాటిని తుది ఉత్పత్తులుగా మార్చేది. రెడ్డీస్ ల్యాబోరేటరీ విజయాల్లో జీవీ ప్రసాద్ పాత్ర మరువలేనిది. ఒకవైపు చైర్మన్ గా పనిచేస్తూనే మరోవైపు ఫార్మ (Pharma) రంగంలో సాధించాల్సిన అభివ్రుద్ధిపై ద్రుష్టి సారిస్తున్నారాయన.

అత్యున్నత హోదాలు

AP రాష్ట్ర కమిటీ, WWF-ఇండియా

అడ్వైజరీ బోర్డు సభ్యుడు, అక్యుమెన్ ఫండ్

బోర్డు సభ్యుడు, Cyient Ltd.

బోర్డు సభ్యుడు, డయానా హోటల్స్, ఇండియా

బోర్డు సభ్యుడు, ఓసిమమ్ బయో సొల్యూషన్స్

సభ్యుడు, అమెరికన్ కెమికల్ సొసైటీ

సభ్యుడు, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్

పర్యావరణం, మేధో సంపత్తి కమిటీపై CII జాతీయ కమిటీ ఛైర్మన్

Also Read: Tata Ev Battery : ఇక టాటా ఈవీ బ్యాటరీలు..13000 కోట్లతో ప్లాంట్