Ex Mla Guvvala Balaraju Arrest : మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు (Achampet Ex Mla Guvvala Balaraju )ను పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో గువ్వ‌ల బాల‌రాజు ప్రెస్ మీట్ నిర్వహించడం తో పాటు.. అంబటిపల్లి గ్రామంలో ఆలయంలో నిర్వహించనున్న ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు అవుతారని తెలిసి..కాంగ్రెస్ (Congress) శ్రేణులు ఆయన్ను అడ్డుకునేందుకు యత్నించారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో ఎలాంటి విధ్వస […]

Published By: HashtagU Telugu Desk
Balaraju

Balaraju

అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వ‌ల బాల‌రాజు (Achampet Ex Mla Guvvala Balaraju )ను పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో గువ్వ‌ల బాల‌రాజు ప్రెస్ మీట్ నిర్వహించడం తో పాటు.. అంబటిపల్లి గ్రామంలో ఆలయంలో నిర్వహించనున్న ధ్వజస్తంభ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు అవుతారని తెలిసి..కాంగ్రెస్ (Congress) శ్రేణులు ఆయన్ను అడ్డుకునేందుకు యత్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఎలాంటి విధ్వస ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. విషయం తెలిసిన బీఆర్ఎస్ శ్రేణులు వెల్దండకు తరలివచ్చి ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. రోడ్డుపై ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటుతుండడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ (Congress) అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు చేస్తున్నారని బిఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్‌ నాయకులను అణచివేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read Also : Bigg Boss 7 : బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆగ్రహం

  Last Updated: 18 Dec 2023, 02:13 PM IST