Site icon HashtagU Telugu

TTDP: టీడీపీ లోకి మాజీ మంత్రి కృష్ణ యాద‌వ్‌?

Tdp

Tdp

`రెండు ద‌శాబ్దాల క్రితం ప‌వ‌ర్ ఫుల్ పొలిటిషియ‌న్ కృష్ణ యాద‌వ్‌. హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల పాలిటిక్స్ ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచేది. యంగ్ లీడ‌ర్ గా ఎదుగుతూ అన‌తికాలంలోనే మంత్రి ప‌ద‌విని పొందిన టీడీపీ ఒక‌ప్పటి భాగ్య‌న‌గ‌రం సింహం..` విధి వ‌క్రీక‌రించ‌డంతో న‌కిలీ స్టాంపుల కుంభ‌కోణం ఆయ‌న్ను వెంటాడింది. ఇక అప్ప‌టి నుంచి రాజ‌కీయంగా తిరిగి నిల‌బ‌డ‌లేక‌పోయారు. పూర్వ వైభ‌వం కోసం ఇప్పుడు టీడీపీ చెంత‌కు చేర‌నున్నార‌ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ వ‌ర్గాల్లోని టాక్‌. బ‌ల‌మైన బీసీ నాయ‌కునిగా ఉన్న కృష్ణ యాద‌వ్ ఎక్క‌డ పోయిందో అక్క‌డే వెదుక్కోవ‌డానికి సన్న‌ద్ధం అయిన‌ట్టు తెలుస్తోంది.

యువ నాయ‌కునిగా బ‌ల‌మైన యాద‌వ సామాజిక‌వ‌ర్గం నుంచి అన‌తికాలంలోనే కృష్ణ యాద‌వ్ ఎదిగారు. హైద‌రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేట‌ర్ గా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి కృష్ణ‌యాద‌వ్ తొలుత ఎంట్రీ ఇచ్చారు. ఆయ‌న 1986 నుంచి 1991 వ‌ర‌కు కార్పొరేట‌ర్ ఉన్నారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సుల‌తో 1994లో టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కేంద్ర, రాష్ట్రాల్లో టీడీపీ కీల‌క రోల్ పోషించిన 1998 – 2001 మ‌ధ్య కాలంలో చంద్ర‌బాబు క్యాబినెట్ లో కృష్ణ యాద‌వ్ మంత్రిగా ఉన్నారు. ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ రాజ‌కీయాల‌ను ఒంటిచేత్తో నడిపారు. ఆ స‌మ‌యంలో దేశ వ్యాప్తంగా బ‌య‌ట‌కొచ్చిన న‌కిలీ స్టాంపుల కేసులో మ‌హారాష్ట్ర పోలీసులు ఆయ‌న్ను అరెస్ట్ చేశారు. ఫ‌లితంగా మంత్రి ప‌ద‌విని కోల్పోవ‌డంతో పాటు జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. దీంతో 2003 నుంచి రాజ‌కీయాల‌కు క‌నుమ‌రుగు అయ్యారు. సీన్ క‌ట్ చేస్తే, 2012లో సెకండ్ ఇన్నింగ్స్ ను టీడీపీలోనే ప్రారంభించారు.

Also Read:  AP, TS Elections: ఏపీ, తెలంగాణ‌ కు ఒకేసారి ఎన్నిక‌లు! `ముంద‌స్తు` కు జ‌గ‌న్‌?

అప్ప‌టికే కృష్ణ‌యాద‌వ్ అండ‌తో ఎదిగిన శ్రీనివాస్ యాద‌వ్ లాంటి వాళ్లు పార్టీలో కీల‌కంగా ఉన్నారు. ఆయ‌న పార్టీని వీడిన 2003 నాటి రోజుల్లా 2012లో టీడీపీ ప‌రిస్థితి లేదు. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన కృష్ణ యాదవ్ 2016 వ‌ర‌కు ఓపిక ప‌ట్టారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా అంబర్‌పేట సీటును బీజేపీకి కేటాయించవద్దని కృష్ణయాదవ్ ప‌ట్టుబ‌ట్టారు. 2014 ఎన్నిక‌ల్లో ఆ స్థానం నుంచి ఆయ‌న రంగంలోకి దిగాల‌ని అంబర్‌పేటను ఎంచుకున్నారు. కానీ, కిషన్ రెడ్డికి టీడీపీ హైకమాండ్ ఇచ్చింది. అంతేకాదు, 2016 గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను కాద‌ని కార్పొరేట‌ర్ల టిక్కెట్ల‌ను టీడీపీ అధిష్టానం కేటాయించింది. అంతేకాదు, పొత్తులో భాగంగా కృష్ణ యాద‌వ్ స్ట్రాంగ్ గా ఉండే డివిజ‌న్ల‌లో బీజేపీ అభ్య‌ర్థుల‌కు టిక్కెట్ల‌ను కేటాయించింది. దీంతో బీజేపీ నేత కిష‌న్ రెడ్డి, కృష్ణ యాద‌వ్ మ‌ధ్య పొస‌గ‌లేదు. ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా కృష్ణ యాద‌వ్ కు ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన టీఆర్ఎస్ ఆయ‌న్ను ఆహ్వానించింది. గులాబీ గూటికీ చేరారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న చ‌రిష్మాను వాడుకున్న టీఆర్ ఎస్ ఆ త‌రువాత ప‌క్క‌న ప‌డేసింది.

యాదవ్ 1985లో టీడీపీలో సాధారణ పార్టీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1986లో TD టిక్కెట్‌పై MCH కార్పొరేటర్‌గా ఎన్నిక‌య్యారు. ఆ త‌రువాత 1994, 1999లో హిమాయత్‌నగర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు వ‌రుస‌గా ఎమ్మెల్యే అయ్యారు. ప్రభుత్వ విప్‌గా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా ప‌నిచేశారు. అయితే, 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు, దేశాన్ని కుదిపేసిన బహుళ-కోట్ల నకిలీ స్టాంప్ పేపర్ కుంభకోణం కార‌ణంగా ఆయ‌న్ను పూణెలోని ఎరవాడ జైలుకు తరలించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ స్కామ్ లో కృష్ణ యాదవ్ భాగస్తుడ‌ని ఆనాడు ఆయ‌న‌పై ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అతను తెల్గీ ఎజెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని జైలుకు పంపారు.

Also Read:  Supreme Court: ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై `సుప్రీం` ఆరా

అయితే, డిసెంబరు 2006 వరకు మూడేళ్లపాటు జైలు జీవితం గడిపిన తర్వాత మాజీ మంత్రికి క్లీన్ చిట్ లభించింది. 2009లో టీడీపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన చేసిన ప్రయత్నాలను నగరంలోని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ నుంచి టికెట్‌ దక్కించుకుని ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కిషన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. తిరిగి 2012 నవంబర్‌లో టీడీపీలో చేరిన ఆయన అప్పటి నుంచి అంబర్‌పేట నియోజకవర్గంపై దృష్టి సారించారు. పొత్తులో బీజేపీకి అంబ‌ర్ పేట‌ను చంద్ర‌బాబు ఇవ్వ‌డంతో మ‌న‌స్తాపంతో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.

ప్ర‌స్తుతం కాసాని జ్ఞానేశ్వ‌ర్ టీడీపీ తెలంగాణ ప‌గ్గాలు తీసుకున్నారు. ఆయ‌న బీసీ నాయ‌కుల‌ను తిరిగి టీడీపీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ క్ర‌మంలో బ‌ల‌మైన యాద‌వ సామాజిక‌వ‌ర్గానికి చెందిన కృష్ణ యాద‌వ్ ను ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పెద్ద‌గా ప్రాధాన్యంలేని లీడ‌ర్ గా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయ‌న తిరిగి టీడీపీలో చేర‌తార‌ని స‌మాచారం. రాజ‌కీయ ప్ర‌స్తానాన్ని ప్రారంభించిన టీడీపీ నుంచే మ‌ళ్లీ ఎద‌గాల‌ని క‌సితో ఆయ‌న ఉన్నార‌ని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి కూడా ఇప్పుడు కృష్ణ యాద‌వ్ లాంటి అవ‌స‌రం ఉంది. దీంతో మ‌రో ప‌వ‌ర్ ఫుల్ లీడ‌ర్ టీడీపీలో క‌నిపిస్తార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read:  CBN Kurnool: క‌ర్నూలు టీడీపీ దూకుడు, చంద్ర‌బాబు జోష్‌!