TS : తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయం – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 02:13 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్తు ఫై చర్చ వాడివేడిగా నడుస్తుంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో మాజీ మంత్రి జగదీశ్ సవాల్ విసరగా..సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తూ.. విద్యుత్‌పై మూడు అంశాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌.. జగదీశ్ రెడ్డి (Ex Minister Jagadish Reddy) పై రెచ్చిపోయారు. యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. రూ.10 వేల కోట్లు జగదీశ్‌రెడ్డి తిన్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టెండర్‌ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. “24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పడం అబద్ధం. సబ్‌ స్టేషన్లలో లాగ్ బుక్కులు చూస్తే తెలుస్తుంది. నేను వెళ్లిన తర్వాత లాగ్ బుక్కులు లేకుండా చేశారు. రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయి. గత ప్రభుత్వం పదవి విరమణ చేసిన వాళ్లను పెట్టి దోచేశారు.” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

అలాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం..జగదీష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. త్వరలోనే తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగు అవ్వడం ఖాయమని , బీఆర్ఎస్ నేతల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని, జైలు కెళ్లటం ఖాయమని అన్నారు. మీరు చేయాల్సింది మీరు చేశారు.. మీ చేయాల్సి మేం చేస్తామని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి మార్చిందన్నారు. జగదీశ్ రెడ్డి ప్రస్టేషన్ లో ఉన్నారని , కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీశ్ రెడ్డికి వేల కోట్లు ఎక్కడివి అని ప్రశ్నించారు.

Read Also : Singareni Elections : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్