Site icon HashtagU Telugu

Hyderabad: ఏసీబీ కస్టడీకి హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ

Shiva Balakrishna

Shiva Balakrishna

Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈరోజు ఉదయం చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అంతకుముందు జైలులో శివ బాలకృష్ణకు వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కార్యాలయానికి తరలించారు

ఏసీబీ కోర్టు శివ బాలకృష్ణకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. శివ బాలకృష్ణ ఎనిమిది రోజుల రిమాండ్ కు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు తెల్లవారుజామున చంచల్‌గూడ జైలుకు చేరుకున్న ఏసీబీ అధికారులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణ పేరిట నాలుగు ఖాతాలు ఎస్‌బీఐ బ్యాంకులో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ బ్యాంకు లాకర్లను తెరిచే అవకాశం ఉంది.

కాగా ఐదు రోజుల క్రితం హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌, ప్రస్తుత రెరా కార్యదర్శి శివ బాలకృష్ణ, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో 24వ తేదీ ఉదయం 5 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 17 చోట్ల ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. మణికొండలోని ఆయన నివాసంతో పాటు అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించారు.

2018-2023 మధ్య కాలంలో హెచ్‌ఎండీ ప్లానింగ్ విభాగంలో కీలక హోదాలో పనిచేసిన శివ బాలకృష్ణ. అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారన్న ఆరోపణలు, తాజాగా వారిపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు.

ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో మణికొండలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా తనిఖీల్లో భాగంగా పదికి పైగా ఐఫోన్లు, 50 అత్యంత ఖరీదైన వాచీలు, నగదు కట్టలు, 5 కిలోల బంగారు నగలు, 70 ఎకరాలకు సంబంధించిన భూమి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Kinetic Luna electric: కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచింగ్ డేట్ ఫిక్స్.. ధర పూర్తి వివరాలివే?

Exit mobile version