Site icon HashtagU Telugu

Etela Will Contest Against KCR : కేసీఆర్ ఫై పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన ఈటెల రాజేందర్

Etela Rajender Will Contest

Etela Rajender Will Contest

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etela Rajender) కీలక ప్రకటన చేసారు. కాస్కో సీఎం (CM KCR) ..నీపై నేను పోటీ చేయబోతున్న అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. నవంబర్ 30 న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election 2023) జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఇదే క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ కాకా రేపుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender)సంచలన ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ (Etela Rajender Will Contest Against KCR) పోటీ చేస్తున్న గజ్వేల్ నుంచి తాను బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. హుజురాబాద్ బిజెపి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్ తో పాటు, గజ్వేల్ లోను పోటీ చేస్తానని ఈటల స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఎలాగైతే రెండు చోట్ల నుండి పోటీ చేస్తున్నారో.. తాను కూడా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తానని, రెండింటిలోనూ తానే విజయం సాధిస్తానని, కేసీఆర్ ను చిత్తుగా ఓడిస్తానని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల ప్రకటనపై బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also : Bengaluru : సోషల్ మీడియా లో ప్రియురాలి నగ్న ఫొటోస్ ను పోస్ట్ చేసిన ప్రియుడు..ఎందుకు తెలిస్తే ఛీ..అనకుండా ఉండలేరు