TS : ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు… మరి ఈ సిపాయి ఎలా చేయగలడు..?- ఈటెల

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 11:33 PM IST

కేసీఆర్ (KCR) అడ్డగోలు హామీలు ఇచ్చినప్పుడే నీ అయ్యజాగీరు కాదు.. ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి అని చెప్పిన… ఆ సిపాయే లక్ష రుణమాఫీ చెయ్యలేదు. మరి ఈ సిపాయి రెండు లక్షల రుణమాఫీ (Runamafi) ఎలా చేయగలడు..? ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..అని ప్రకటించారు బిజెపి నేత ఈటెల రాజేందర్ (Etela Rajender). ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడం తో తెలంగాణ లో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సీట్లు సాధించకపోయినా..గతంతో కంటే కాస్త మెరుగ్గా ఫలితాలు రావడం తో బిజెపి..పార్లమెంట్ స్థానాలపై మరింత ఫోకస్ పెట్టింది. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో భారీ సీట్లు సాధించి సత్తా చాటాలని బిజెపి నేతలు చూస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రచారాన్ని ఇప్పటి నుండే మొదలుపెట్టి ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం ఆసిఫాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే , బిజెపి నేత ఈటెల రాజేందర్ పాల్గొని అధికార పార్టీ కాంగ్రెస్ ఫై , మాజీ సీఎం కేసీఆర్ ఫై విమర్శలు చేసారు. కాంగ్రెస్ వారు నాలుగు వందల హామీలు ఇచ్చారు. అందులో ముఖ్యమైనవి 66 ఉన్నాయి. పాలసీలు ప్రకటించుకుంటూ పోయారు. ఎవరు సలహాలు ఇచ్చారో కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రంలో వీటిని ఎలా అమలు చేస్తారు అని ఈటెల ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నట్లు ఈటెల తెలిపారు. సీఎం గారు.. ఊరిస్తున్న మంత్రులారా.. మహిళలకు రూ.2500, కళ్యాణలక్ష్మి తులం బంగారం, మహిళాసంఘాలకు వడ్డీలేని రుణాలు ఎప్పటినుండి ఇస్తారు..? అంటూ ప్రశ్నించారు. ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయగలిగితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. రూ.5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకావు. ఇప్పుడే నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శించను కానీ విజ్ఞత గల ప్రజలారా ఆలోచన చేయండి అని తెలిపారు.

Read Also : Medaram-Samakka : గద్దె మీదకు చేరుకున్న సమ్మక్క