Site icon HashtagU Telugu

Etela Rajender : రేవంత్ సర్కార్ ను నీటి బుడగతో పోల్చిన ఈటెల

Etela Rajender comments on revanth reddy

Etela Rajender comments on revanth reddy

మల్కాజిగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ (Etela Rajender) మరోసారి సీఎం రేవంత్ (CM Revanth) ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ కు దమ్ముంటే వెంటనే మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించాలని , కాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందడి మొదలైంది. రీసెంట్ గా ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబదించిన నోటిఫికేషన్ ప్రకటించడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఇప్పటికే కాంగ్రెస్ , బిజెపి , బిఆర్ఎస్ పలువురి పేర్లు ప్రకటించడం తో..ఆయా అభ్యర్థులు వారి వారి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. అతి పెద్ద పార్లమెంట్ స్థానం ఐన మల్కాజిగిరి లో బిజెపి నుండి ఈటెల బరిలోకి దిగుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో రోజు రోజుకు తన దూకుడు ను పెంచుతూ..అధికార పార్టీ ఫై విమర్శల అస్త్రం పెంచుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ గా మాట్లాడుతూ..రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి ఫండ్స్‌ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్‌ (CM Revanth Reddy Black Mail) చేస్తున్నారని ఈటెల ఆరోపించారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని.. ఆయన బ్లాక్ మెయిల్ చిట్టా అంత రికార్డు అవుతున్నదని అన్నారు. రాష్ట్రంలో అన్నీ తానేనని రేవంత్‌ విర్రవీగుతున్నారని, దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈటెల హెచ్చరించారు. నడమంత్రపు సిరిలా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్‌.. రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు చేయగా..తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నీటి బుడగ లాంటిదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే తనపై అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్ విసిరారు. డబ్బున్న వ్యక్తి కోసం రేవంత్ వెతుకుతున్నారని.. ఇవి డబ్బు సంచులు, ధర్మానికి మధ్య జరిగే ఎన్నికలని ఈటల అభివర్ణించారు. మరోవైపు రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక మరికాసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ జాబితా లో మల్కాజ్ గిరి అభ్యర్థిని ప్రాస్తారో లేదో చూడాలి.

Read Also : India Vs China : అరుణాచల్‌పై వట్టి మాటలు కట్టిపెట్టండి.. చైనాకు భారత్ హితవు