Praja Palana Celebrations : ఏం సాధించారని రేవంత్ సంబరాలు – ఈటల సూటి ప్రశ్న

Praja Palana Celebrations : "ఏం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు (Praja Palana Celebrations)చేసుకుంటున్నారు..? హోదా మరచి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు" అంటూ ఫైర్ అయ్యారు

Published By: HashtagU Telugu Desk
etela rajender, cm revanth

etela rajender, cm revanth

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో పలు అంశాలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender).. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “ఏం సాధించారని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు (Praja Palana Celebrations)చేసుకుంటున్నారు..? హోదా మరచి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు” అంటూ ఫైర్ అయ్యారు.

ఈటల మాట్లాడుతూ..కాంగ్రెస్, బీఆర్ఎస్ (Congress -BJP) పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలి. ఎవరి ఫోన్లు ఎవరు ట్యాప్ చేశారో బయటపెట్టాలి. ప్రజాస్వామ్యంలో పారదర్శకత చాలా అవసరం” అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై రేపు శనివారం హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ స్టేడియంలో బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(BJP National President JP Nadda) హాజరవుతారని ఈటల తెలిపారు. ఈ సభలో రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి పలు దుర్మార్గాలను బహిరంగంగా బయటపెడతామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై బీజేపీ మద్దతు ఉంటుందని, రేపటి ఆటో డ్రైవర్ల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, వారి హక్కుల కోసం బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు.

ఇక రేపు జరగబోయే సభ ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి సునీల్‌ బన్సల్‌ రెండురోజుల కిందట రాజధానితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులతో సభ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 6 అబద్ధాలు, 66 మోసాలు అన్న నినాదంతో కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది.

Read Also : Foreign Students In India: భార‌త‌దేశంలో చదువులను ఇష్టపడుతున్న విదేశీయులు!

  Last Updated: 06 Dec 2024, 11:44 AM IST