Eatala Rajender Assets: ఈటెలకు సొంత కారు కూడా లేదా ? ఆస్తులు తెలిస్తే షాక్ అవుతారు

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ ఈ రోజు తన ఎన్నికల అఫిడవిట్ ని సమర్పించారు. అయితే ఈటెల సమర్పించిన అఫిడవిట్ చూసి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

Eatala Rajender Assets: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ ఈ రోజు తన ఎన్నికల అఫిడవిట్ ని సమర్పించారు. అయితే ఈటెల సమర్పించిన అఫిడవిట్ చూసి కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈటెల వద్ద ప్రస్తుతం లక్ష రూపాయలు కూడా లేవట. అంతేకాదు అతనికి ఈ రోజు నాటికి సొంతంగా కారు కూడా లేదట. ఆయన భార్య ఈటల జమున వద్ద రూ.1.42 లక్షల నగదు ఉన్నట్లు ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. అలాగే 2022-23 సంవత్సరానికి అతని ఆదాయం దాదాపు రూ. 13 లక్షలు కాగా, అతని భార్య ఆదాయం దాదాపు రూ. 1.5 కోట్లు.

రిటర్నింగ్ అధికారికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రాజేందర్‌కు సొంత కారు లేదు. కానీ ఆయన భార్య ఈటెల జమునకు ఇన్నోవా, ఇన్నోవా క్రిస్టా మరియు సిఆర్‌వి ఉన్నాయి. 50 లక్షల విలువైన 1.5 కిలోల బంగారం ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఆయన చరాస్తుల మొత్తం విలువ రూ.6.73 లక్షలు కాగా, స్థిరాస్తుల విలువ రూ.12.5 కోట్లు. ఆయన భార్య ఈటల జమున చరాస్తులు రూ.26.6 కోట్లు అయితే స్థిరాస్తుల విలువ రూ.14.7 కోట్లుగా ప్రకటించారు. .ఈటెల రాజేందర్‌కు దాదాపు రూ. 5.5 కోట్లు, జమునకు దాదాపు రూ. 15 కోట్ల అప్పులు ఉన్నట్లు తెలిపారు. వీటిని బ్యాంకులు, వ్యక్తుల నుంచి పొందిన రుణాలుగా చూపించారు.

రంగారెడ్డి జిల్లా దేవరాయమిజల్ , పూడూరు గ్రామాల్లో, మెదక్ జిల్లా అచ్చంపేట్ గ్రామంలో ఆయన భార్యకు వ్యవసాయ భూములున్నాయి. వీరిద్దరి వ్యవసాయ భూమి మొత్తం 72.5 ఎకరాలు. ఈ ఆస్తులేవీ వారసత్వం ద్వారా వారికి రాలేదు. ఇందులో 44 ఎకరాలను 2014 నుంచి 2020 మధ్య జమున కొనుగోలు చేసింది. జమునకు బంజారాహిల్స్‌లో 500 చదరపు గజాల విస్తీర్ణంలో వ్యవసాయేతర భూమి ఉంది. దీనిని 2013లో రూ.2 కోట్లకు కొనుగోలు చేశారు. రాజేందర్ మరియు జమున ఇద్దరూ కలిసి 1,84,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య భవనాలను (పౌల్ట్రీ షెడ్‌లు, భవనం, గ్రామీణ గోడౌన్) కలిగి ఉన్నారు. ఈ ఆస్తులను 2000 మరియు 2002లో మొత్తం రూ. 1.05 కోట్లతో కొనుగోలు చేశారు. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.5.5 కోట్లు.

We’re now on WhatsAppClick to Join

జమునకు నివాస భవనాలు లేకపోయినా, రాజేందర్‌కు కమలాపూర్‌లో (400 చదరపు గజాలు), పోడూరులో (0.32 గుంటలు) ఉమ్మడి కుటుంబ ఆస్తి ఉంది. పోడూరులోని ఇంటిని ఆయన 2016-17లో కొనుగోలు చేశారు. ఈ రెండు నివాస గృహాల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.7.5 కోట్లు. ఇక తనపై 54 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 5 కేసుల్లో దోషిగా తేలి రూ.100 నుంచి రూ.1,500 వరకు జరిమానా విధించినట్లు రాజేందర్‌ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో రైల్‌రోకోలు, అక్రమ సభలు, రైళ్లను అడ్డుకోవడం, నిర్భందించటం, బస్టాండ్‌ను ధ్వంసం చేయడం, పోలీసు సిబ్బందిని అడ్డుకోవడం, పోలీసు సిబ్బందిపై దౌర్జన్యం చేయడం, రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ సమయంలో ఆయనపై చాలా కేసులు నమోదయ్యాయి.

Also Read: Bhadrachalam: భద్రాచలం రాములోరి తలంబ్రాలను ఇలా బుక్ చేసుకోండి