Site icon HashtagU Telugu

Etala vs Bandi: బండి వ‌ర్సెస్ ఈట‌ల.. బీజేపీలో ముదురుతున్న వివాదం!

Etala vs Bandi

Etala vs Bandi

Etala vs Bandi: తెలంగాణ బీజేపీలో ఇద్దరు కీలక నేతలు, ఎంపీలు అయిన బండి సంజయ్- ఈటెల రాజేందర్ (Etala vs Bandi) మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వనని బండి సంజయ్ పరోక్షంగా హెచ్చరించినట్లు వచ్చిన వార్తలపై ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్.. బండి సంజయ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. నువ్వెవడివి అసలు? నీ శక్తి ఏంది, నీ స్థాయి ఏంది? నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏంది? అని ప్రశ్నిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. 2002 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను. రెండు సార్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశాను, రెండు సార్లు జిల్లా మంత్రిగా పని చేశాను అని ఈటెల తన అనుభవాన్ని గుర్తు చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నా చరిత్ర నీకు తక్కువ తెలుసు కొడకా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లతో కొట్లాడినవాడిని. బండి సంజయ్ లాంటి వాడితో కొట్లాడితే నా పతార ఏం కావాలి? అని తన రాజకీయ అనుభవాన్ని, ప్రత్యర్థుల స్థాయిని పోల్చి చూపి, బండి సంజయ్‌ను తక్కువ చేసి చూపారు.

Also Read: Health Warning: పిజ్జా, బ‌ర్గ‌ర్‌లు తెగ లాగిస్తున్నారా? అయితే ఈ స‌మ‌స్య‌ల‌కు వెల్‌క‌మ్ చెప్పిన‌ట్లే!

హుజురాబాద్ నియోజకవర్గంపై తన పట్టును వివరిస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఎంపీకి కూడా అన్ని ఓట్లు వేయించాను అని స్పష్టం చేశారు. 2019లో ఆనాడు నువ్వు కరీంనగర్ ఎంపీగా గెలిచినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీకి 53 వేలు మెజారిటీ వచ్చింది. బీ కేర్ ఫుల్ కొడకా అంటూ హెచ్చరించారు.నేను శత్రువుతో కొట్లాడుతా. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోను నా కొడకా అని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. వారి మధ్య ఉన్న అంతర్గత విభేదాలను వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికల టికెట్ల విషయంలో రేపు నా మనుషులే సర్పంచ్‌గా, వార్డ్ మెంబెర్‌గా ఉంటారు అని ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వనన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. స్ట్రెయిట్ ఫైట్ చేస్తా, నీలాగా స్ట్రీట్ ఫైట్ చేయను అంటూ పోరాట శైలిపై ఈటెల‌ వ్యంగ్యంగా విమర్శించారు.

ముదురుతున్న బీజేపీ అంతర్గత వివాదం

ఈటెల వర్సెస్ బండి సంజయ్ వివాదం రోజురోజుకు తీవ్రమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గానికి టికెట్లు ఇవ్వనంటూ పరోక్షంగా బండి సంజయ్ హెచ్చరించడం ఈ వివాదానికి ప్రధాన కారణం. “నాకు హుజురాబాద్‌లో తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేశారు. వాళ్లకు టికెట్లు ఇవ్వమంటారా..? అంటూ బండి సంజయ్ పరోక్షంగా ఈటెల వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.