అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతానని ముందే తెలుసన్నారు మాజీ మంత్రి , బిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao). శనివారం వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానని నాకు ముందే తెలుసని, అందుకే ఎన్నికలకు 3 నెలల ముందే తన సీటు మార్చాలని కేసీఆర్ ను కోరానని దయాకర్ రావు చెప్పుకొచ్చారు. అంతే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 40 సీట్లు మాత్రమే గెలుస్తోందని కేసీఆర్ కు చెప్పానని, మరో 20 స్థానాల్లో సిట్టింగ్లన్ను మార్చాలని ముందే సూచించానని అన్నారు. ఇందులో భాగంగానే తన స్థానం కూడా మార్చాలని కోరారన్నారు. ప్రజల అభిప్రాయం తనకు తెలుసని.. వరంగల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. రెండో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
శుక్రవారం కూడా ఎర్రబెల్లి..సీఎం రేవంత్ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి ఎవరో కాదని.. తన శిశ్యుడే అని చెప్పుకొచ్చారు. వర్ధన్నపేటలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ తన శిశ్యుడే అని కామెంట్లు చేశారు. ఇక ఎర్రబెల్లి దయాకరరావు 1994, 1999, 2004లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వరుసగా విజయం సాధించారు. 2009, 2014, 2019లో పాలకుర్తి నుంచి విజయం సాధించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఓటమి ఎరుగని నేత 2023లో కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని చేతిలో ఓటమి చెందారు.
Read Also : Chandrababu: ఆర్టీసీఎండీకి చంద్రబాబు లేఖ.. ఎందుకంటే ?