Site icon HashtagU Telugu

IT Employees : చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా మీము బయటకు రాకపోతే మేము వేస్ట్ – టెకీలు

IT Employees

Babu Arrest

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఈరోజు హైదరాబాద్ లోని విప్రో సర్కిల్ వద్ద ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు వల్లనే ఐటీ అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కూడా బయటకు రాకపోతే మేము వేస్ట్ అంటూ నల్ల రిబ్బన్లతో నిరసన చేసారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు హయాంలో ఐటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని..అలాంటి గొప్ప నాయకుడ్ని..విజన్ ను ఈరోజు జైల్లో పెట్టడం దారుణమన్నారు.

చంద్రబాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకమని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. కానీ కావాలనే కుట్ర చేసి బాబును జైలుకు పంపారని ఆరోపించారు. తాను అవినీతి పరుడు అయితే మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారని జగన్ భ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదిస్తూ.. చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని ..ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలి, ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేసారు. జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

Read Also : Kobbari Laddu: ఆంధ్రాస్టైల్ కొబ్బరి లడ్డు.. ట్రై చేయండిలా?

స్కిల్ డెవలప్ మెంట్ కేసు లో చంద్రబాబు (Chandrababu Arrest)ను అరెస్ట్ చేయడం పట్ల ఏపీలో లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తప్పుపడుతున్నారు. రాజకీయ పార్టీ అలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో తమ నిరసనలను తెలియజేయగా..ఇప్పుడు ఐటీ ఉద్యోగులు (IT Professionals) సైతం ‘ఐయాం విత్ సీబీఎన్'(‘I am with CBN’) అంటున్నారు. చంద్రబాబు సీఎం గా ఉన్న టైములో ఐటీ ని ఎంత డెవలప్ చేసారో చెప్పాల్సిన పనిలేదు.

హైదరాబాద్ (Hyderabad ) ను ఐటీ హబ్ గా మార్చిందే చంద్రబాబు. అప్పటివరకు ఐటీ అంటే తెలియని వారు సైతం చంద్రబాబు ఐటీ ని డెవలప్ చేసిన తర్వాత అంత ఐటీ రంగం వైపు దృష్టి పెట్టారు. ఇప్పటికి హైదరాబాద్ లో ఐటి రంగం ఎంత అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు వల్లే అని ప్రతి ఒక్కరు చెపుతారు. అంతలా ఐటీ ని అభివృద్ధి చేసిన చంద్రబాబును ఓ తప్పుడు కేసులో అరెస్ట్ చేయడం ఏంటి అని వారంతా ప్రశ్నిస్తూ రోడ్ల మీదకు వచ్చారు.

Exit mobile version