Election Mission : బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నిక‌ల క్యాలెండ‌ర్! మిష‌న్ 100-90

మిష‌న్ 90 దిశ‌గా బీజేపీ, మిష‌న్(Mission) 100 దిశ‌గా బీఆర్ఎస్ పావులు క‌దుపుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 29, 2022 / 02:08 PM IST

మిష‌న్ 90 దిశ‌గా బీజేపీ, మిష‌న్(Mission) 100 దిశ‌గా బీఆర్ఎస్ పావులు క‌దుపుతున్నాయి. ఆ మేర‌కు రెండు పార్టీలు వ్యూహాల‌ను త‌యారు చేసుకుంటూ క్షేత్ర‌స్థాయి పరిస్థితుల‌ను స‌మీక్షిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మిష‌న్(Mission) 90 దిశ‌గా క్యాడ‌ర్ కు బీజేపీ దిశానిర్దేశం చేస్తోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్ప‌డానికి మిష‌న్ 100(ఎంపీలు) కోసం కేసీఆర్ స్కెచ్ వేశారు. అందుకోసం సీనియ‌ర్ల‌తో కూడిన ప్ర‌త్యేక టీమ్ ను నియ‌మించారు. మిష‌న్ 90 కోసం బీజేపీ మూడు రోజుల పాటు హైద‌రాబాద్ కేంద్రంగా క్యాడ‌ర్ కు ప్ర‌త్యేక శిక్ష‌ణ (Training) ఇస్తోంది.

మిష‌న్ 90 దిశ‌గా బీజేపీ మిష‌న్(Mission)

హైదరాబాద్ వేదికగా మూడు రోజుల పాటు కార్య‌క‌ర్త‌ల‌కు బీజేపీ పెద్ద‌లు దిశానిర్దేశం చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఆ క్ర‌మంలో జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ , కేంద్రమంత్రి అమిత్‌షా, బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ , సునీల్ బన్సల్ శిక్షణ తరగతులకు హాజ‌ర‌య్యే షెడ్యూల్ ఉంది. వాళ్లు ఇచ్చే డైరెక్ష‌న్ మేర‌కు మిష‌న్ 90 ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి చేరిక‌ల‌ను ప్రోత్సహించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి భారీ స్కెచ్ ర‌చించారు.ఏడాది పాటు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘మిషన్ 90 తెలంగాణ 2023’ పేరుతో కార్యాచరణ (Training) మొదలు పెట్టింది. ఏడాది పాటు చేపట్టే కార్యక్రమాల ఎన్నికల క్యాలెండర్ రెడీ అయింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 90 స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ మిషన్ లక్ష్యం. బలహీనంగా ఉన్న 45 స్థానాల్లో బలమైన నాయకులను తీసుకొచ్చేలా చేరికల కమిటీని అధిష్ఠానం ఆదేశించింది.

Also Read : T BJP : ఈటెల‌కు బీజేపీ ప‌గ్గాలు, కేంద్ర మంత్రిగా `బండి`?

జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టిన కేసీఆర్ మిష‌న్ 100 ల‌క్ష్యాన్ని చేరుకోవ‌డానికి 11 రాష్ట్రాల మీద ఫోక‌స్ పెట్టారు. ఆ రాష్ట్రాల్లో 60 స్థానాల నుంచి పోటీ చేయాల‌ని తొలి విడ‌త నియోజ‌క‌వ‌ర్గాల‌ను గుర్తించారు. వివిధ రాష్ట్రాల్లోని 100 లోక్‌సభ నియోజకవర్గాలను గుర్తించే బాధ్య‌త‌ను సీనియర్ నేతలు బి. వినోద్ కుమార్, ఎస్. మధుసూధనా చారి తదితరులకు అప్ప‌గించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, గుజరాత్‌, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌తో సహా 11 రాష్ట్రాల్లో 60 సీట్లను ఆ టీమ్‌ ఇప్పటి వరకు గుర్తించగలిగింది.ఏపీ రాజ‌కీయాల విష‌యంలో బీఆర్ఎస్ క్లారిటీకి రాలేక‌పోతోంది. బీజేపీతో జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు దిశ‌గా స‌మాలోచ‌న‌లు జ‌రుగుతోన్న క్ర‌మంలో ఆచితూచి అడుగువేస్తోంది. ఒక ఆ పొత్తు ఖ‌రారు అయితే, వైసీపీతో జ‌త క‌ట్ట‌డానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది.

బీఆర్ ఎస్ మిష‌న్ 100 

ఢిల్లీ కేంద్రంగా ఆయా రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌ను స‌మీక్షించ‌డానికి క్రిస్మ‌స్ త‌రువాత కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము రాష్ట్రానికి వ‌చ్చారు. ఆమెకు ఈనెల 26న స్వాగ‌తం ప‌లికిన కేసీఆర్ ఈనెల 30న ఎట్ హోమ్ కార్య‌క్ర‌మానికి బొల్లారం రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో క‌నిపించ‌బోతున్నారు. అందుకే ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అక్రమాస్తుల కేసులో హైకోర్టు సిట్ నుంచి సీబీఐకి దర్యాప్తును బదిలీ చేయడం, ఈ కేసులో ఈడీ ఇంటరాగేషన్‌ను ఎదుర్కొంటున్న పార్టీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వంటి అనూహ్య పరిణామాలు కూడా న్యూఢిల్లీ పర్యటనను వాయిదా వేయడానికి కారణాలుగా చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని కేసీఆర్ వ‌ర్గీయులు చెబుతున్నారు.

Also Read : Punjab CM Meets KCR: కేసీఆర్ తో పంజాబ్ సీఎం భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ!

మొత్తం 543 స్థానాలకు అభ్యర్థులను 2024 సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి ఎంపిక చేయ‌డం క‌ష్టంగా భావించిన బీఆర్ ఎస్ మిష‌న్ 100 ల‌క్ష్యాన్ని పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడానికి సీఎం నాలుగు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఫలితంగా బీఆర్‌ఎస్ సొంతంగా లేదా ఇతర బీజేపీయేతర పార్టీలతో పొత్తు పెట్టుకునే 100 లోక్‌సభ స్థానాలను గుర్తించే కసరత్తును సీఎం ప్రారంభించారు. ఫిబ్రవరి 2023 నాటికి ‘మిషన్ 100’ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాల‌ని టీమ్ కు కేసీఆర్ డెడ్ లైన్ పెట్టారు. దేశంలోని 28 రాష్ట్రాలు ఉండ‌గా తెలుగు జనాభా గణనీయంగా ఉన్న 12 లేదా 13 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప్ర‌ధానంగా ఫోక‌స్ పెట్ట‌నుంది.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని న‌డుపుతోన్న బీజేపీ తెలంగాణ మీద మిష‌న్ 90 ప్ర‌ణాళిక‌ను ర‌చించ‌గా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఢిల్లీ పీఠం ఎక్క‌డానికి మిష‌న్ 100 పెట్టుకుని దూకుడుగా వెళుతున్నారు. ఆ రెండు పార్టీలు వేస్తోన్న అడుగులు ఆస‌క్తి క‌లిగిస్తున్నాయి.

Also Read : CBN Effect : రేవంత్ రెడ్డికి `గురు`గ్ర‌హ‌ణం! ఖ‌మ్మం స‌భ హిట్ తెచ్చిన తంటా!