Election Fixing : `షా` తో మంత్రి కేటీఆర్ మిలాఖ‌త్, పొలిటిక‌ల్ స్కెచ్

మంత్రి కేటీఆర్ ఢిలీ(Election Fixing )వెళ్లారు .మూడు రోజుల పాటు అక్క‌డే ఉంటారు. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు.

  • Written By:
  • Publish Date - June 23, 2023 / 04:35 PM IST

మంత్రి కేటీఆర్ ఢిలీ (Election Fixing )వెళ్లారు .మూడు రోజుల పాటు అక్క‌డే ఉంటారు. కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. ఆ భేటీ వెనుక రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కంటే రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఉన్నాయ‌ని ప్ర‌త్య‌ర్థుల న‌మ్మ‌కం. రాబోవు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి పొత్తు పెట్టుకుంటున్నాయ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ మాణిక్ ఠాకూర్ ఆరోపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, మూడేళ్లుగా ఉప్పు, నిప్పులా ఉన్న బీఆర్ఎస్ , బీజేపీ ద‌గ్గ‌ర‌వుతున్నాయ‌ని సంకేతాలు క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

మంత్రి కేటీఆర్ కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ (Election Fixing )

ముచ్చింత‌ల్ రామానుచార్యుల విగ్ర‌హం ప్రారంభం సంద‌ర్భంగా నెల‌కొన్ని ప్రొటోకాల్ వివాదం నుంచి కేంద్రంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. జాతీయ స్థాయికి పార్టీని విస్త‌రింప చేయ‌డానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. వివిధ రాష్ట్రాల‌కు చెందిన సీఎంల‌ను, ఆయా రాష్ట్రాల్లోని ప్ర‌ధాన పార్టీల లీడ‌ర్ల‌తో భేటీ అయ్యారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని గ‌ద్దె దించాల‌ని నిన‌దించారు. అంతేకాదు, న‌రేంద్ర మోడీ వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడారు. త‌న‌దైన శైలిలో బూతుపురాణం కూడా మోడీ మీద వినిపించారు. ప్ర‌తిగా ప్ర‌భుత్వాన్ని ప‌డేస్తామ‌ని న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్ కేంద్రంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంకేముంది ఆ రెండు పార్టీల మ‌ధ్య రాజ‌కీయ. వైరం తారాస్థాయికి చేరిందని భావించారు.

మెట్రో విస్త‌ర‌ణ‌,కంటోన్మెంట్ అంశాల గురించి ఢిల్లీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న అంటూ

ప్ర‌భుత్వాన్ని ప‌డేసేందుకు బీజేపీ చేసిన ప్ర‌య‌త్నాల‌ను ఫామ్ హౌస్ కేంద్రంగా కేసీఆర్ బ‌య‌ట‌పెట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోల‌ను దేశ వ్యాప్తంగా పంచారు. నానా యాగీ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు కేసీఆర్. బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయ‌డానికి స్కెచ్ వేశారు. ప్ర‌తిగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను బీజేపీ బ‌య‌ట‌కు తీసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ క‌విత‌ను ఆ కేసులో సీబీఐ, ఈడీ విచార‌ణ చేసింది. ఆమె అరెస్ట్ ఖాయ‌మ‌ని తెలంగాణ స‌మాజం అనుకుంది. కానీ, అక‌స్మాత్తుగా ఆ కేసును బ‌ట్ట‌దాఖ‌లు చేశారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య ఏదో ఉంద‌ని (Election Fixing )న‌మ్మ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Also Read : KTR: కేటీఆర్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షాతో భేటీ!

ఢిల్లీ లిక్క‌ర్. స్కామ్ లో క‌విత‌ను సీబీఐ, ఈడీ వ‌దేలేసిన త‌రువాత రాజ‌కీయంగా బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింది. ఆ పార్టీ నుంచి సీనియ‌ర్లు, ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్లు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకుంటున్నారు. ఇలాంటి త‌రుణంలో మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. మెట్రో విస్త‌ర‌ణ‌,కంటోన్మెంట్ అంశాల గురించి ఢిల్లీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న అంటూ మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. కానీ, సీఎం హోదాలో కేసీఆర్ వెళ్లాలి. ఆయ‌న‌కు బ‌దులుగా కేటీఆర్ వెళ్ల‌డం ఒక ఎత్తు. ఇక అమిత్ షా తో భేటీ మ‌రో అంశం. ఆయ‌న ప‌ర్య‌ట‌న చూస్తుంటే, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ‌కీయాన్ని బీజేపీ, బీఆర్ఎస్ చుట్టూ తిరిగేలా ఏదో స్కెచ్ వేస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : CM KCR: సంగారెడ్డి నుంచి హయత్‌నగర్ మెట్రో వ‌స్తుంద‌ని హామీ ఇచ్చిన‌ కేసీఆర్‌.. కానీ, ఒక్క ష‌ర‌తు