హనుమకొండ(D) కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను ప్రశ్నించిన మ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఏమీ చేయలేదని విమర్శించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు, కోడిగుడ్ల(Eggs Attack)తో కౌశిక్ (Koushik Reddy) పై దాడి చేసారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలు విసిరేశారు. ఇక ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేసి ,ఇరువర్గాలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం గ్రామా సభలు(Grama Sabha) ఏర్పాటు చేస్తుంది.
Green Tea : మెదడు ఆరోగ్యానికి గ్రీన్ టీ పనిచేస్తుందా..? ఈ అధ్యయనం ఏం చెబుతున్నది..!
ఈ సభల్లో ఇందిరమ్మ ఇల్లు , రైతు భరోసా పత్రాలను స్వీకరిస్తుంది. ఈ క్రమంలో గురువారం హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ఏర్పాటు చేసిన గ్రామసభలో పెద్దెత్తున గ్రామస్తులతోపాటు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికూడా సభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లిస్ట్ పై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రశ్నించడంతో.. అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ హయాంలో ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు.. ? ఎందుకు ప్రశ్నిస్తున్నారు.. ? ఎందుకు ఇళ్లు రాకుండా అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా గ్రామసభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, అనుచరులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలుచున్నారు. అదేసమయంలో ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్థులపై కుర్చీలతో దాడి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలిసి పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎమ్మెల్యేకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించడంతో గ్రామసభ యథావిధిగా జరిగింది.