Telangana Waterfalls: భారీ వర్షాల ఎఫెక్ట్, కుంటాల, పొచ్చెర వాటర్ ఫాల్స్ సందర్శన బంద్!

తెలంగాణలోని ములుగు జిల్లాలోని జలపాతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Bogatha Waterfalls

Bogatha Waterfalls

తెలంగాణలోని ములుగు జిల్లాలోని జలపాతాలకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే భారీ వర్షాలు కురిసి కుంటాల, పొచ్చెర జలపాతాల్లోకి వదర నీరు ప్రవహిస్తుండటంతో జులై 24 వరకు సందర్శకులు, పర్యాటకులకు మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రెండు జలపాతాలకు భారీగా ఇన్ ఫ్లో వస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎఫ్ ఓ పి.రాజశేఖర్ ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 24 వరకు సందర్శకులు, పర్యాటకులు జలపాతాల సందర్శనకు అనుమతించబోమని తెలిపారు.

పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీరు ఈ మూడు జలపాతాల్లోకి ప్రవహించడంతో బొగత, ముత్యాలదార జలపథం, కొంగల వాటర్ ఫాల్స్ చూడముచ్చటగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ములుగు జిల్లాలోని మూడు జలపాతాలు కళకళలాడుతున్నాయి.

అయితే గత మూడు రోజులుగా జోరుగా కురుస్తున్న వర్షాల కారణంగా ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి బొగత జలపాతం లోయలోకి అత్యధికంగా వరదనీరు చేరడంతో బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చింది. జలపాతాలను చేరుకోవడానికి పర్యాటకులకు స్థానిక గిరిజన గైడ్‌లు అవసరం. స్థానిక గైడ్‌ల సహాయం లేకుండా అటవీ సిబ్బంది పర్యాటకులను జలపాతాల వద్దకు ట్రెక్కింగ్ చేయడానికి అనుమతించడం లేదు.

Also Read: KCR: తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ దాశరథి

  Last Updated: 22 Jul 2023, 11:53 AM IST