Hyderabad to Vijayawada: భారీ వర్షాల ఎఫెక్ట్, TSRTC బస్సులు రద్దు

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి.

  • Written By:
  • Updated On - July 28, 2023 / 12:21 PM IST

Hyderabad to Vijayawada: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను #TSRTC రద్దు చేసింది. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపటం జరుగుతోంది. ఈ మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించు కోగలరు. మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించగలరని తెలంగాణ ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read: Andhra Pradesh: బీసీలపై టీడీపీ చిత్తశుద్ధి: జయహో బీసీ సదస్సు