Site icon HashtagU Telugu

Eelection Meetings : స‌భ‌ల సంద‌డి! 23న కేసీఆర్, 25న ఖ‌ర్గే, 28న అమిత్ షా

Eelection Meetings

Eelection Meetings

తెలంగాణ రాష్ట్రం మీద కాంగ్రెస్, బీజేపీ (Eelection Meetings) క‌న్నేశాయి. ఆ రెండు పార్టీలు దూకుడు పెంచాయి. ఈనెల 25న ఖ‌ర్గే తెలంగాణ‌కు వ‌స్తుండ‌గా, ఈనెల 28న అమిత్ షా ఖమ్మం స‌భ‌కు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవ‌ల జాతీయ పార్టీల నేత‌ల మీటింగ్ లు వాయిదా ప‌డ్డాయి. దీంతో కొంత స్తబ్దుగా ఉన్న పార్టీలు ఇప్పుడు మ‌ళ్లీ హ‌డావుడి చేస్తున్నాయి. పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేస్తూ ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. మ‌రో వైపు బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈనెల 23న మెద‌క్ స‌భ ద్వారా కేసీఆర్ ఎన్నిక‌ల శంఖారావం పూర్తి స్థాయిలో పూరించ‌నున్నారు.

ఈనెల 23న మెద‌క్ స‌భ ద్వారా కేసీఆర్ ఎన్నిక‌ల శంఖారావం (Eelection Meetings) 

ఒక్క‌సారిగా గ్రాఫ్ ప‌డిపోయిన బీజేపీ మ‌ళ్లీ పుంజుకోవ‌డానికి  (Eelection Meetings) ప్ర‌య‌త్నం చేస్తోంది. క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత విజ‌యోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ దూకుడు పెంచింది. అభ్య‌ర్థుల ఖారారు చేయ‌డానికి స‌ర్వేల‌ను న‌మ్ముకుంది. ఆ స‌ర్వేల్లో ఎవ‌రు ముందుంటే వాళ్ల‌కే టిక్కెట్ ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ గీటురాయిగా పెట్టింది. ఇక అభ్య‌ర్థిత్వాల‌ను ఆశించే వాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పిలుపునిచ్చింది. తొలి రోజు సుమారు 18 మంది టిక్కెట్ల కోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. ఇక బీజేపీ తొలి జాబితా సిద్ద‌మ‌యింద‌ని చెబుతోంది. కానీ, అభ్య‌ర్థుల వేట‌లో ప‌డింది.

Also Read : BJP: మధ్యప్రదేశ్‌లో 39 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన బీజేపీ

ఈనెల 28న జ‌రిగే అమిత్ షా స‌భ‌లో పెద్ద ఎత్తున చేరిక‌లు ఉంటాయ‌ని ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ఈటెల రాజేంద్ర చెబుతున్నారు. ఇత‌ర పార్టీల నుంచి 22 మంది రాబోతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. బీజేపీలోకి రావడానికి ఎవ‌రూ పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డంలేద‌ని తెలుస్తోంది.ఇత‌ర పార్టీల లీడ‌ర్ల‌ను ఆహ్వానిస్తే రివ‌ర్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నార‌ని ఇటీవ‌ల ఈటెల వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే. కానీ, ఇప్పుడు ఆయ‌నే 22 మంది ఇత‌ర పార్టీల లీడ‌ర్లు చేరుతున్నార‌ని చెబుతున్నారు. రాబోవు రోజుల్లో మ‌రింత మంది బీజేపీ వైపు వ‌స్తార‌ని ఆశిస్తున్నారు. కానీ, చేరిక‌ల క‌మిటీ దాదాపుగా క్లోజ్ అయింద‌ని ప్ర‌చారం హోరెత్తుతోంది.

తెలంగాణ‌కు అమిత్ షా

గ‌తంలో బీజేపీ తెలంగాణ చీఫ్ గా ఉన్న‌ బండి సంజ‌య్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో ట‌చ్ లో ఉన్నార‌ని ప్ర‌చారం చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ, హుజూరాబాద్‌, మ‌నుగోలు ఉప ఎన్నిక‌ల్లోనూ ఆ ప్ర‌చారం కొంత మేర‌కు ఫ‌లించింది. ఆ త‌రువాత ఆయ‌న మాట‌లు ఉత్తదేన‌ని తేలింది. అంతేకాదు, ఎమ్మెల్సీ క‌వితను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టిన బీజేపీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. దీంతో బీజేపీ మాట‌ల‌ను న‌మ్మే ప‌రిస్థితి ప్ర‌స్తుతం లేదు. అందుకే, బీజేపీ వైపు చూసే లీడ‌ర్లు లేర‌ని (Eelection Meetings)  స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ తెలంగాణ‌కు అమిత్ షా వ‌స్తున్నారు. ఇప్ప‌టికే మూడుసార్లు వాయిగా వేసుకున్న స‌భ‌ను ఎట్ట‌కేల‌కు నిర్వ‌హించాల‌ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈనెల 25న ఖ‌ర్గే తెలంగాణ‌కు (Eelection Meetings)

ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పెద్ద‌గా లేదు. ఆ పార్టీకి అభ్య‌ర్థులు కొర‌త ఉంది. హుజూర్ న‌గ‌ర్, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి వంద‌ల ఓట్లు మాత్ర‌మే ప‌డ్డాయి. అంటే, ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఉనికి ఎక్క‌డా కనిపించ‌దు. ప్ర‌త్యేకించి ఖ‌మ్మం జిల్లాల్లో క‌మ్యూనిస్ట్ లు ఎక్కువ‌గా ఉంటారు. అక్క‌డ బీజేపీ నీడ కూడా క‌నిపించ‌దు. అలాంటి చోట అమిత్ షా స‌భ పెడుతున్నారు. ఆ వేదిక మీద ఇత‌ర పార్టీల లీడ‌ర్లు ప‌లువురు చేర‌తార‌ని (Eelection Meetings) ఈటెల చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈనెల 28న అమిత్ షా ఖమ్మం స‌భ‌కు

ఇక కాంగ్రెస్ పార్టీ క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత దూకుడుగా ఉంది. అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తోంది. మూడు కోణాల నుంచి స‌ర్వేలు చేయించింది. రాహుల్, ప్రియాంక టీమ్ ఒక స‌ర్వే, రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలు మ‌రో స‌ర్వే, వార్ రూమ్ ఇంచార్జిగా ఉన్న శశికాంత్ సెంథిల్ మ‌రో స‌ర్వేను చేయించారు. ఈ మూడు స‌ర్వేల‌ను క్రోడీకరించ‌డం ద్వారా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయాల‌ని వ్యూహాత్మ‌కంగా ముందుకెళుతోంది. ఇప్ప‌టికే వ్య‌వ‌సాయ‌, యువ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా డిక్ల‌రేష‌న్ ను ప్ర‌క‌టించ‌నుంది. ఈనెల 25న చేవెళ్ల‌లో జ‌రిగే స‌భ ద్వారా (Eelection Meetings) బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

Also Read : Congress to BRS : బీఆర్ఎస్ లోకి జ‌గ్గారెడ్డి?  కాంగ్రెస్ కు జ‌ల‌క్!

అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన క‌ల్వ‌కుంట్ల కుటుంబం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తోంది. ఈనెల 23న మెద‌క్ స‌భ‌ను కేసీఆర్ పెడుతున్నారు. ఆ స‌భ‌లో ఎన్నిక‌ల శంఖారావం పూరించ‌నున్నారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల ద్వారా సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేయ‌బోతున్నారు. అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా ఆయ‌న ప్ర‌సంగాన్ని సిద్ధం చేసుకున్నారు. భూముల ధ‌ర‌ల‌ను చూప‌డం ద్వారా ఓట్ల‌ను దండుకోవాల‌ని చూస్తున్నారు. ఇక మ‌రో వైపు మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడుగా ప్ర‌చారం చేస్తున్నారు. మంత్రి హ‌రీశ్ రావు త‌న‌దైన పంథాలో ప్ర‌చారంకు దిగారు. ఎమ్మెల్సీ క‌విత మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేలా క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇలా..క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఎన్నిక‌ల బ‌రిలో హ‌ల్ చ‌ల్ చేస్తూ మూడోసారి అధికారం కోసం చెమ‌టోడ్చుతున్నారు.