Site icon HashtagU Telugu

CM Revanth Reddy : యంగ్‌ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి

Education and work in Young India are my brand: CM Revanth Reddy

Education and work in Young India are my brand: CM Revanth Reddy

CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సీఎం రేవంత్‌ రెడ్డి యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌నుప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పోలీసులకు యంగ్‌ ఇండియా స్కూల్‌ అత్యంత ముఖ్యమైందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచామని తెలిపారు. సైనిక్ స్కూల్‌కు ధీటుగా పోలీస్ స్కూల్‌ను తీర్చి దిద్దాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖపై తనకు స్పష్టమైన ఆలోచన ఉందన్నారు. దేశంలో ఉన్న గొప్ప వర్సిటీలు నెహ్రూ స్థాపించినవేనని చెప్పారు.

Read Also: Akhanda 2 : బాలకృష్ణ- బోయపాటి మధ్య విభేదాలా..? అఖండ 2 ఆగిపోయిందా..? క్లారిటీ ఇదే !

యంగ్‌ఇండియా పోలీస్‌ స్కూల్‌కు రూ.100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ను సమకూర్చుకోవాలి. నిధుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అని రేవంత్‌రెడ్డి తెలిపారు. 16 నెలలైనా బ్రాండ్‌ ఎందుకు సృష్టించుకోలేదని నన్ను కొందరు అడుగుతున్నారు. యంగ్‌ ఇండియాలో చదువు, ఉపాధే నా బ్రాండ్‌. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. దేశానికే దార్శనికుడు పీవీ నరసింహారావు. యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని స్థాపించాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కేజీ టు పీజీ వరకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు అన్నారు.

ఇవాళ యూనివర్సిటీలో చేరిన ప్రతీ విద్యార్థికి ఉద్యోగ భద్రత ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పోలీస్ స్కూల్ అంశాన్ని పొందుపరిచాం. పోలీసు స్కూల్‌ విషయంలో రాజకీయం లేదు. రూ.2 కిలో బియ్యంతో ఎన్టీఆర్ ప్రతీ పేదవాడి మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం అంటే వైఎస్సార్‌ గుర్తుకువస్తారు. కొందరు ఉద్యమ నేతలం, తెలంగాణ ప్రదాతలమని అనుకుంటున్నారు. యంగ్‌ ఇండియా స్కూల్‌ నా బ్రాండ్‌. ఆనంద్ మహేంద్రను యూనివర్సిటీకి చైర్ పర్సన్ గా నియమించుకున్నాం అన్నారు.

Read Also: Lookout Notices : కాకాణి గోవర్ధన్‌రెడ్డికి లుకౌట్‌ నోటీసులు జారీ