ED Vs Kavitha : లిక్కర్ స్కాం.. ఇవాళ కవిత భర్తను విచారించనున్న ఈడీ

ED Vs Kavitha : ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Kavitha Cm Revanth

Kavitha Cm Revanth

ED Vs Kavitha : ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పలువురు నిందితుల చుట్టూ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఉచ్చు బిగిస్తోంది. గత శుక్రవారం సాయంత్రం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను(ED Vs Kavitha) ఈడీ అరెస్ట్‌ చేసింది.  ఆమెను మరుసటి రోజు (శనివారం) మధ్యాహ్నం ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో  హాజరుపర్చగా .. ఏడు రోజుల కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజు కూడా ఈడీ అధికారులు కవితను విచారించారు.

We’re now on WhatsApp. Click to Join

నేడు కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కవితను విచారించనున్నారు. విచారణలో భాగంగా ఢిల్లీ లిక్కర్  స్కాం కేసులో రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంపై కవితను ఈడీ ప్రశ్నిస్తోంది. కవిత పాత్రకు సంబంధించి అరుణ్ రామచంద్ర పిళ్లై, ఆడిటర్ బుచ్చిబాబు, మాగుంట రాఘవ, శరత్ చంద్ర రెడ్డి ఇప్పటికే ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలంలో ఉన్న సమాచారాన్ని కవిత ద్వారా ఈడీ ధ్రువీకరించేందుకు యత్నిస్తోంది. గత విచారణలో తాము అడిగిన ప్రశ్నలకు కవిత తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని ఈడీ అంటోంది.

Also Read :Telangana Rains : తెలంగాణలో నాలుగు రోజులు తేలికపాటి వానలు

ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు, లాయర్లను కవిత కలుసుకునేందుకు కోర్టు  అనుమతించింది. ఈనేపథ్యంలో ఆదివారం రోజు ఈడీ విచారణ అనంతరం కవితతో భర్త అనిల్, అన్న కేటీఆర్, న్యాయవాది ములాఖత్ అయ్యారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత మరోసారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేవని ఆ పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఇందులో ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పేరును ప్రస్తావించారు. రేపు (మంగళవారం) కవిత పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.

Also Read : Putin Win : మరోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్.. నాటోకు ‘వరల్డ్ వార్‌‌’ వార్నింగ్

  Last Updated: 18 Mar 2024, 08:42 AM IST