Site icon HashtagU Telugu

ED Search : పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు 

Ed Search On Brs Mla

ED Search : తెలంగాణలో మళ్లీ ఈడీ రైడ్స్ పర్వం మొదలైంది. ఇవాళ  ఉదయం 5 గంటల నుంచి పటాన్​చెరు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు  జరుగుతున్నాయి. ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్​రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.  నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ ఈ రైడ్స్(ED Search) చేస్తున్నట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

అక్రమ మైనింగ్ కేసులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  సోదరుడు బీఆర్ఎస్ నేత మధుసూదన్ రెడ్డి  మార్చి 15న  అరెస్టు అయ్యారు. పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో ఆయనను అరెస్టు చేశారు. చీటింగ్, అక్రమ  మైనింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద మధుసూదన్ రెడ్డిపై  కేసులు నమోదు చేశారు.

Also Read : Hajj Pilgrims : 90 మంది భారతీయ హజ్ యాత్రికుల మృతి ?

మాజీ సీఎం కేసీఆర్ ​అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్​ కన్నారావుపై మార్చి 14న రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్​స్టేషన్​లో అటెంప్ట్  టు మర్డర్​, భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్  మండలం మన్నెగూడ  సర్వే నెంబర్ 32/ఆర్​యూయూ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. కన్నారావు మార్చి 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్​ పేర్కొన్నారు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కన్నా రావుతో పాటు 38 మంది బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : 18799 Jobs : బంపర్ ఆఫర్.. మూడింతలు పెరిగిన రైల్వే ఏఎల్‌పీ జాబ్స్