Site icon HashtagU Telugu

KCR : తెలంగాణ గొంతుకపై నిషేధమా..? ఇదెక్కడి న్యాయం..?

Ec Shock Kcr

Ec Shock Kcr

ఎన్నికల ప్రచారంలో బిజీ గా ఉన్న బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు ఈసీ (EC) షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఈసీకి పిర్యాదు చేయడం తో..ఆయనపై 48 గంటల నిషేధం విధించింది. 48 గంటలపాటు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆంక్షలు విధించింది. దీనిపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడిన‌ రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్ట‌లేదు.. కానీ నా మీద ఈసీ నిషేధం విధించింది ధ్వజమెత్తారు. 48 గంట‌లు నా ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధిస్తే.. దాదాపు 96 గంట‌ల పాటు ల‌క్ష‌లాది బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అవిశ్రాంతంగా ప‌ని చేస్తారు హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన రోడ్ షో లో పాల్గొన్న కేసీఆర్.. ఈ రోజు ఎక్కువ టైం లేదు నాకు. ఈసీ నా మీద‌ నిషేధం పెట్టింది. మ‌హ‌బూబాబాద్ అభివృద్ధి చెందాల‌ని, మ‌నంద‌రం కూడా ఆలోచ‌న చేసి రాష్ట్రంలో మారుమూల ప్రాంత‌మైన దీన్ని జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజు ఈ రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హబూబాబాద్ జిల్లాను ర‌ద్దు చేస్తామ‌ని చెబుతుంది. మ‌హబూబాబాద్ జిల్లా ఉండాల్నా..? పోవాల్నా..? మ‌హబూబాబాద్ జిల్లా ఉండాలంటే, ఈ ముఖ్య‌మంత్రి మెడ‌లు వంచాలంటే ఇక్క‌డ మాలోత్ క‌విత గెల‌వాలి. మ‌హ‌బూబాబాద్ జిల్లాను కేసీఆర్ ఏర్పాటు చేసిండు.. మ‌రి ఉండాల్నా..? ఊడిపోవాల్నా..? జిల్లా ఉండాలంటే కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి.. మాలోత్ క‌విత గెల‌వాలి అని కేసీఆర్ సూచించారు.

ఇక కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఫై నిషేధం విధించడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. తెలంగాణ గొంతుకపైనే నిషేధమా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్ కు ప్రవచనాల్లాగా వినిపించాయా? ఎన్నికల సమయంలో ప్రచారాన్ని నిషేధించడం ఏంటి..? ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా ఎన్నికల కమిషన్ పట్టించుకోదా? మోడీ విధ్వేష వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ వినిపించడం లేదా? బడే భాయ్..చోటే భాయ్ కలిసి కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు.

Read Also : NTR – Prabhas : సలార్ 2ని పక్కన పెట్టేసి.. ఎన్టీఆర్ సినిమా స్టార్ట్ చేయబోతున్న ప్రశాంత్ నీల్..