Site icon HashtagU Telugu

Etela Rajender: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల

Etela Rajender

Etela Rajender

Etela Rajender: తెలంగాణలో బీజేపీ ప్రస్థానాన్ని కొనసాగిస్తుంది. గతేడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, అధికార పార్టీ బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. అటు బీజేపీ పుంజుకుంది. రాష్ట్రంలో బీజేపీ 8 అసెంబ్లీ సీట్లను దక్కించుకుంది.. ఇక తాజాగా జరిగిన లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభంజనం సృష్టించింది. తెలంగాణలో 17 లోకసభ స్థానాలకు గానూ అధికార కాంగ్రెస్ పార్టీ 8 సీట్లకే పరిమితం అయింది. ఒవైసికి ఒక సీటు రాగా, బీజేపీ 8 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో తెలంగాణలో బీజేపీ బలం పెరిగినట్టయింది. అటు దేశంలో బీజేపీ విజయం సాధించింది.

తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఇక్కడ అధినాయకత్వంపై మార్పులు చేసేందుకు ఢిల్లీ బీజేపీ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష పదివిలో మార్పు జరగనుంది. ఈ మేరకు బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. రేపు అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆందులో భాగంగా ఈ రోజు ఆదివారం ఈటల రాజేందర్ తో అమిత్ షా ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తుంది. అధిష్టానం దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస శర్మ ఈటెల రాజేందర్ తో చర్చలు జరిపారు. తెలంగాణలో అధికారం లోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, ఇందుకోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యత స్వీకరించాలని కోరినట్లు తెలిసింది. ఇక ఢిల్లీ పెద్దల నిర్ణయంతో దీనికి ఈటెల రాజేందర్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.

రేపు సోమవారం ఈటెల రాజేందర్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read: Odisha: జూన్ 12న ఒడిశా గడ్డపై తొలిసారి బీజేపీ జెండా

Exit mobile version