Early Election : కేసీఆర్ ఎన్నికల శంఖారావం! ముహూర్తం ఫిక్స్!!

ఎన్నికల శంఖారావాన్ని(Before Election) పూరించడానికి కేసీఆర్ ముహూర్తం సెట్ చేశారు.

  • Written By:
  • Updated On - March 4, 2023 / 01:25 PM IST

ఎన్నికల శంఖారావాన్ని (Before Election )పూరించడానికి కేసీఆర్ (KCR) ముహూర్తం సెట్ చేశారు. ఆ లోపు అసెంబ్లీ ని రద్దు చేసి ప్లీనరీ ద్వారా ప్రచారానికి దిగాలని భావిస్తున్నారని పార్టీ వర్గాల్లోని చర్చ. అందుకోసం ఏప్రిల్ 27వ తేదీ ని ఫిక్స్ చేసుకున్నారని టాక్. ఆ రోజుకు బీ ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం సరిగ్గా ఏడాది అవుతుంది. దేశ వ్యాప్తంగా బీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లతో ఆ సభను పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎన్నికల శంఖారావాన్ని పూరించడానికి కేసీఆర్ ముహూర్తం (Before Election )

వివిధ రాష్ట్రాలలో కీలకంగా ఉన్న రాజకీయ పార్టీలను బీఆర్ఎస్ వైపు ఆకర్షించడానికి కొత్త వ్యూహం(Before Election) కేసీఆర్ రచిస్తున్నారు. బిఆర్ఎస్ ప్లీనరీని అందుకు వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఆ రోజు ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్లీనరీ వేదికగా పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం చెయ్యటంతో పాటు, అతిపెద్ద బహిరంగ సభను నిర్వహించి, దేశం దృష్టి బీఆర్ఎస్ పై పడేలా చేయాలని ఆయన ప్లాన్. ఆ తర్వాత వరుసగా రాష్ట్రాల పర్యటనలు చేయాలని గులాబీ అధినేత భావిస్తున్నట్టు సమాచారం.

Also Read : KCR BRS: బీఆర్ఎస్ దూకుడు.. మాణిక్ కదమ్ కు కీలక బాధ్యతలు!

బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తొలి ప్లీనరీ హిట్ చేయాలని వ్యూహం .సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్లీనరీని నిర్వహిస్తారు. అయితే గులాబీ పార్టీ అధినేత కెసిఆర్ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో అవసరం లేకున్నా ప్లీనరీని నిర్వహించారు. ఇప్పుడు బిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత అత్యంత ఘనంగా ప్లీనరీ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి షాక్ ఇచ్చేలా (Before Election )ఉండాలని భావిస్తున్నారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రులను, ప్రాంతీయ పార్టీల నేతలను ప్లీనరీకి ఆహ్వానించి దేశం దృష్టిని ఆకర్షించాలని కేసీఆర్ (KCR) వ్యూహం. ఆ క్రమంలోని బిఆర్ఎస్ ఏర్పాటు జరిగిన తర్వాత జరగనున్న తొలి ప్లీనరీ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ప్లీనరీ సమావేశం తో పాటు భారీ బహిరంగ సభ

ప్లీనరీ సమావేశం తో పాటు భారీ బహిరంగ సభను(Before Election) ఏర్పాటు చేసి బిజెపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ పార్టీని చూపించాలని కెసిఆర్ భావిస్తున్నారు. ప్లీనరీ వేదికగా రాజకీయం రంజుగా మొదలు పెట్టనున్నారు. ఆ క్రమంలోనే ఆయన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో పాటు, బీహార్ సీఎం నితీష్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తదితరులను ఆహ్వానించాలని నిర్ణయించినట్టు సమాచారం.

తొలి బీ ఆర్ ఎస్ ఆవిర్భావ సభ 

బిఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని(Before Election) అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ కాలేదు. ఇతర రాష్ట్రాల్లో ఆశించిన మేర ఫలితాలు రావటం లేదు. ఇతర రాష్ట్రాల్లో భారీగా విస్తరించటానికి అవకాశాలు రాలేదు. ప్లీనరీ వేదికగా స్థానికంగా పార్టీని బలోపేతం చెయ్యటం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం చేయటంతో పాటు దేశ రాజకీయాల కోసం చేస్తున్న కెసిఆర్ కొత్త ఎత్తుగడ పన్నుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసి దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని, వచ్చే ఎన్నికలకు బలంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ను విస్తరించడానికి చాప కింద నీరులా పనిచేస్తున్న కేసీఆర్, ఇంకా పూర్తిస్థాయిలో అన్ని రాష్ట్రాల పైన దృష్టి సారించలేకపోతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బీఆర్ఎస్ విస్తరణా పనులు ప్రారంభించిన కేసీఆర్ 2024 ఎన్నికల సమయానికి దేశంలో బలంగా దూకుడుగా ముందుకు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అన్నదానిపై ఆలోచిస్తున్నారు. ఒక్కసారిగా దేశం మొత్తాన్ని ఆకర్షించే ఆపరేషన్ ఆకర్ష కోసం కసరత్తులు చేస్తున్నారు. దానికి తొలి బీ ఆర్ ఎస్ ఆవిర్భావ సభ పునాది కానుంది.

Also Read:  Resignation in Delhi: సిసోడియా, సత్యేంద్ర జైన్‌ రాజీనామా