DSC Update : సాంకేతిక సమస్యలతో ఇవాళ ఉదయం ఆగిపోయిన తెలంగాణ డీఎస్సీ-2024 కౌన్సెలింగ్ ప్రక్రియ.. ఎట్టకేలకు మళ్లీ మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ కౌన్సెలింగ్‌లో భాగంగా నియామక పత్రాలను అందుకున్న 10,006 మంది కొత్త టీచర్లకు పాఠశాల విద్యాశాఖ పోస్టింగులను కేటాయిస్తోంది. ఈరోజు ఉదయం కౌన్సెలింగ్‌కు వచ్చి సాంకేతిక సమస్యల ఉండటంతో వెనుదిరిగిన వారికి డీఈవోలు తాజా సమాచారాన్ని(DSC Update) అందించారు. సాంకేతిక సమస్యలు పరిష్కారం కావడంతో డీఎస్సీ కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదలైందని తెలిపారు.
Also Read :Sharad Pawar : రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదాకా ఈ వృద్ధుడు ఆగిపోడు : శరద్ పవార్
ఇవాళ ఉదయం డీఎస్సీ కౌన్సెలింగ్ ప్రక్రియ అకస్మాత్తుగా వాయిదా పడటంతో ఎంతోమంది అభ్యర్థులు ఇబ్బందిపడ్డారు. తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యేకించి కౌన్సెలింగ్ కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ కౌన్సెలింగ్ ప్రక్రియలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకొని ఉండాల్సిందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. అకస్మాత్తుగా అభ్యర్థులను ఈవిధంగా అసౌకర్యానికి గురి చేయడం సబబు కాదని వాదిస్తున్నారు. ఇలాంటి అంశాలపై ముందస్తుగా అభ్యర్థులను అలర్ట్ చేయడం, సమాచారాన్ని పంపడం మంచి పద్ధతని పేర్కొన్నారు. మొత్తం మీద ఇవాళ సాంకేతిక సమస్యకు పరిష్కారం లభించి, కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ డీఎస్సీ కౌన్సెలింగ్ ప్రారంభమవడంతో అభ్యర్థులు ఎంతో ఊరటగా ఫీలయ్యారు.
Also Read :Predator Drones : భారత్-అమెరికా బిగ్ డీల్.. రూ.29వేల కోట్లతో 31 ‘ఎంక్యూ9బీ’ ప్రిడేటర్ డ్రోన్లు
- డీఎస్సీ నోటిఫికేషన్ ఈ ఏడాది ఫిబ్రవరి 29న విడుదలైంది.
- జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు జరిగాయి.
- మొత్తం 11,062 టీచర్ పోస్టులు ఉండగా.. 2.46 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేశారు.
- అర్హులైన అభ్యర్థులకు ఈనెల 1 నుంచి 5 వరకు జిల్లా విద్యాశాఖ అధికారులు 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్లను పరిశీలించారు.
- సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఎంపిక చేసిన వారికి ఈరోజు కౌన్సెలింగ్ నిర్వహించారు.