Site icon HashtagU Telugu

CM Revanth Reddy : తెలంగాణలో డ్రై పోర్ట్‌ ఏర్పాటు : సీఎం రేవంత్‌ రెడ్డి

Dry port to be set up in Telangana: CM Revanth Reddy

Dry port to be set up in Telangana: CM Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జపాన్‌ పర్యటన కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సీఎం అక్కడి తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఐటీ, ఫార్మా రంగాల్లో మంచి పురోగతి సాధించాం. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా, ఫార్మా సిటిగా దేశానికి పరిచయం చేయగలిగాం. కానీ అది సాక్షాత్కారమయ్యే కేవలం తొలి అంకం మాత్రమే. ఇప్పుడు మేము పెట్టుబడులను ఆకర్షించాలనే దిశగా అడుగులు వేస్తున్నాం అంటూ సీఎం పేర్కొన్నారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్‌ఫ్రంట్‌ను పరిశీలించాం. మూసీ నది ప్రక్షాళనకు కొంత మంది అడ్డుపడుతున్నారు.

Read Also: కైపెక్కించే సోకులతో సెగలు రేపుతున్న రకుల్

ఢిల్లీ పరిస్థితిని చూసి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా? మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్‌ రింగ్‌ రోడ్‌, రేడియల్‌ రోడ్స్‌ తెలంగాణ పురోగతికి కీలకం అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు రావాలి.. పరిశ్రమలు పెరగాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర అభివృద్ధిలో అందరి సహకారం అవసరం. మీ తోడ్పాటుతో ప్రపంచంతోనే మనం పోటీ పడొచ్చు. ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోండి అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రపంచంతో పోటీ పడాలంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తప్పనిసరి. ప్రతి తెలంగాణ యువకుడికి ఉద్యోగం రావాలంటే, దేశానికి, ప్రపంచానికి అవసరమైన ప్రాజెక్టులు మన రాష్ట్రంలో ఉండాలి అని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణను బెంగళూరు, ముంబయి, చెన్నై లాంటి దేశీయ నగరాలతో పోల్చడం తక్కువైతే తక్కువే. మేము లండన్, టోక్యో లాంటి మేటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం అని ధీమాగా చెప్పారు. పరిశ్రమలకు మరింత వేగం తేవడానికి ప్రభుత్వం డ్రై పోర్ట్ ప్రాజెక్టును తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిపారు. ఒక రాష్ట్ర అభివృద్ధికి సముద్రాన్ని చేరే మార్గం లేకపోయినా వ్యాపార మార్గాలు తెరవాలంటే డ్రై పోర్ట్ అవసరం. తెలంగాణలో అతి త్వరలోనే డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా నేరుగా దిగుమతి-ఎగుమతులకు మార్గం సుసాధ్యం అవుతుంది. ఇది రైతు నుంచి రిసెర్చ్ సైంటిస్ట్ వరకు ప్రతి ఒక్కరికి ప్రయోజనకరం అని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు.

Read Also: PM Modi : సౌదీలో పర్యటించనున్న ప్రధాని మోడీ