Driving License Test: ఇకపై తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్సును పొందడం పెద్ద ‘పరీక్షే’. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్సు టెస్టుకు సంబంధించిన ప్రక్రియను మరింత కఠినతరం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈమేరకు డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లలో మార్పులు చేయనున్నారు. ఆ వివరాలను తెలుసుకుందాం..
Also Read :First GBS Death : తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం.. ఇవి తెలుసుకోండి
కొత్త ఏర్పాట్లు ఇవీ..
ప్రస్తుతం తెలంగాణలో మాన్యువల్ విధానంలో డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేస్తున్నారు. వీటి జారీలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇకపై ఇందుకోసం అధునాతన టెక్నాలజీని వినియోగించనున్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో తొలిదశలో 21 ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటుచేయనున్నారు. ఆయా ట్రాక్‌లలో వాహనదారుల డ్రైవింగ్ నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలించడానికి కెమెరాలను బిగిస్తారు. టెస్టులో పాల్గొన్న వ్యక్తి.. నిర్ణీత సమయంలోగా డ్రైవింగ్ లైసెన్సు పరీక్షను పూర్తి చేశాడా? రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాడా ? సిగ్నల్‌ను దాటేసి వెళ్లాడా? అనే వివరాలన్నీ కెమెరాలతో షూట్ చేస్తారు. డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లో వాహనాన్ని సరిగ్గా నడిపినట్లు ఈ కెమెరాల ఫుటేజీలో స్పష్టంగా రికార్డు అయితేనే పరీక్షలో పాస్ అయినట్లు ప్రకటిస్తారు. అంతేకాదు..ఒకరి తరఫున మరొకరు డ్రైవింగ్ టెస్టులో పాల్గొనడం ఇకపై కుదరదు. ఎందుకంటే డ్రైవింగ్ టెస్టుకు అప్లై చేసిన వ్యక్తి ఫొటోను, డ్రైవింగ్ టెస్టులో పాల్గొన్న వ్యక్తి ఫొటోను కెమెరాలు సరిపోలుస్తాయి. ఇందుకోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగిస్తారు.
Also Read :TS RTC Buses : ఆర్టీసీ బస్సుల 25,609 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.84 కోట్ల ఫైన్‌లు
ఈ జిల్లాల్లో తొలిదశలో..
తెలంగాణలో తొలిదశలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రాలతోపాటు కొండాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్, పరిగి, మలక్‌పేట, నాగోల్, జహీరాబాద్, పెబ్బేరులో ఆధునిక పరిజ్ఞానంతో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో వచ్చే ఫలితాలను సమీక్షించుకొని, మిగిలిన ప్రాంతాలలో కూడా ఈ తరహా ట్రాక్‌లను(Driving License Test) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఒక్కో టెస్టింగ్ ట్రాక్‌కు దాదాపు 4 ఎకరాల భూమి అవసరం. భూ సేకరణ కోసం త్వరలోనే టెండర్లను పిలిచే ఛాన్స్ ఉంది.