Driverless Vehicles: డ్రైవర్ రహిత వాహనాలను ఎక్కడో అమెరికాలో టెస్ట్ చేస్తున్నారని ఇప్పటిదాకా మనం వింటూ వచ్చాం. ఇప్పుడా అత్యాధునిక వాహనాలు మన తెలంగాణకు కూడా చేరిపోయాయి. వాటిని ఇక్కడ కూడా టెస్టింగ్ చేస్తున్నారు.
Also Read :Professor Kodandaram: ఎమ్మెల్సీ పోల్స్‌లో ఎమ్మెల్సీ కోదండరామ్‌కు షాక్
టెస్టింగ్ ఇలా జరుగుతోంది..
- ఐఐటీ హైదరాబాద్, టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టీహాన్) కలిసి డ్రైవర్ రహిత వాహనాలను టెస్ట్ చేస్తున్నాయి.
- వాస్తవానికి 2022 సంవత్సరం జులై నెల నుంచే ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లోపల ఈ వాహనాల టెస్టింగ్‌ను మొదలుపెట్టారు. ఆ ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఏకంగా రోడ్లపై వాటిని టెస్టింగ్ చేస్తున్నారు.
- డ్రైవర్ రహిత వాహనాలు(Driverless Vehicles) రోడ్లపై తిరిగే క్రమంలో ఎదురయ్యే సమస్యలపై ప్రస్తుతం స్టడీ చేస్తున్నారు.
- ఈ ప్రాజెక్టు కోసం తెలంగాణలోని నిజామాబాద్ నగరాన్ని ఎంపిక చేశారు.
- మన దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 17 ప్రధాన పట్టణాల్లో డ్రైవర్ రహిత కార్లతో ఈ విధంగా సర్వే చేస్తున్నారు.
- నిజామాబాద్‌లోని రోడ్లపై టెస్టింగ్ కోసం వినియోగిస్తున్న డ్రైవర్ రహిత కార్లలో డ్రైవర్ ఉంటున్నాడు. అయితే అతడిని ఎమర్జెన్సీలో వాహనాన్ని కంట్రోల్ చేసేందుకు మాత్రమే కూర్చోబెట్టారు. కారు దానంతట అదే నడుస్తుంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను, ఎదురుగా వచ్చే మనుషులను, వాహనాలను, గుంతలను గమనిస్తూ డ్రైవర్ రహిత కారు ఆచితూచి ముందుకు కదులుతుంటుంది. డ్రైవింగ్‌లో, బ్రేకులు వేయడంలో, గేర్లు మార్చడంలో డ్రైవర్ ప్రయత్నం అస్సలు ఉండదు.
- ఈ డ్రైవర్ రహిత కారుపై 360 డిగ్రీల కోణంలో కెమెరాలను ఏర్పాటు చేశారు. లైడార్, ఎన్‌ఎస్‌ఎస్, నావీటెక్ రీడర్ల ద్వారా ఈ కారును రాడార్‌కు అనుసంధానించారు.
- ఇటీవలే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఐఐటీ హైదరాబాద్‌ను సందర్శించి, స్వయంగా డ్రైవర్ రహిత కారులో ప్రయాణించారు.
- డ్రైవర్ రహిత కార్లు భారతదేశ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేందుకు మరో ఆరేళ్లు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.