TSRTC : బస్సు ఎప్పుడు వస్తుందని అడిగినందుకు ప్రయాణికుడి పై డ్రైవర్ దాడి

హైదరాబాద్ పోవడానికి బస్సులు రావట్లేదని అడిగినందుకు ప్రయాణికుడి మీద దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్

  • Written By:
  • Publish Date - June 10, 2024 / 02:45 PM IST

తెలంగాణ (Telangana) లో ఫ్రీ బస్సు (Free Bus) సౌకర్యం మొదలైన దగ్గరి నుండి అనేక దాడులు , గొడవలు జరుగుతున్నాయి. ప్రయాణికులు కాదు..ఆర్టీసీ సిబ్బంది సైతం ప్రయాణికుల పై దాడులకు పాల్పడుతున్నారు. కొంతమంది బస్సు లో సీటు కోసం గొడవలు పడుతుంటే..మరికొన్ని చోట్ల బస్సు ఎప్పుడు వస్తుంది..ఎందుకు ఆలస్యం అవుతుంది..టైం కు రావా..? అని ప్రశ్నింస్తే దాడి చేస్తున్నారు. తాజాగా షాద్ నగర్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బస్సు ఎప్పుడు వస్తుందని అడిగినందుకు సదరు ప్రయాణికుడి పై డ్రైవర్ దాడికి దిగడం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

గత రాత్రి ఓ ప్రయాణికుడు షాదనగర్ బస్ స్టాండ్ లో గంట సేపటి నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులు రాకపోవడంతో విచారణ అధికారిని హైదరాబాద్ కు వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుందని అడిగాడు. అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ ఇద్దరి మధ్య వాగ్వివాదానికి దారి తీసింది. అంతే ఒక్కసారిగా అక్కడికి ఆర్టీసీ డ్రైవర్లు చేరుకొని ప్రయాణికుడిని చితకబాదారు. సదరు ప్రయాణికుడు హైదరాబాద్ బస్సులు గంట నుంచి రావడం లేదు, టైమింగ్ ఏమైనా చేంజ్ అయిందా? ఏ టైం కి వస్తాయని అడిగినందుకు బస్సు డ్రైవర్ అతన్ని ఇంత హీనంగా చితకబదాడని తోటి ప్రయాణికులు తెలిపారు. ఇంత దౌర్జన్యమా ఇదేం పద్ధతి అంటూ తోటి ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ మొత్తం ఘటనను కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.

Read Also : Swami Swaroopananda : మాట మార్చిన శారదా పీఠం స్వరూపానంద..