DOST 2024 Notification: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల

అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది.

  • Written By:
  • Updated On - May 3, 2024 / 02:19 PM IST

DOST 2024 Notification: అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST 2024 Notification) 2024 నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. రిజిస్ట్రేషన్‌లు మే 6 నుండి ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (విద్యాశాఖ) బుర్రా వెంకటేశం, టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మొదటి దశ అడ్మిషన్ల కోసం రూ.200 ఫీజుతో మే 25 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మే 15 నుంచి 27లోగా వెబ్ ఆప్షన్లు చేసుకోవచ్చని, జూన్ 3న సీట్లు కేటాయిస్తారని తెలిపారు. అదేవిధంగా మరో రెండు దశల్లో అడ్మిషన్లు ఉన్నాయని, జులై 8న క్లాస్ వర్క్ ప్రారంభం అవుతుందని, ఈ ఏడాది 1,066 డిగ్రీ కాలేజీల్లో 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెంకటేశం తెలిపారు. https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.

Also Read: MLC Dande Vithal: బిగ్ షాక్‌.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు

తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీస్‌ తెలంగాణ(DOST-2024) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 6 నుంచి మే 25 వరకు మొదటి ఫేజ్‌ రిజిస్ట్రేషన్‌ ఉంటుందని.. రూ.200 రుసుంతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని మండలి తెలిపింది. మే 15 నుంచి మే 27 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుందని పేర్కొంది. అయితే రాష్ట్రంలో ఇటీవ‌ల ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌ల‌ను అధికారులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

We’re now on WhatsApp : Click to Join