Site icon HashtagU Telugu

Door To Door Survey : అభయహస్తం అప్లికేషన్లపై డోర్ టు డోర్ సర్వే.. ఇవి రెడీ చేసుకోండి

Door To Door Survey

Door To Door Survey

Door To Door Survey : యావత్ తెలంగాణలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతోంది ఒకే అంశం గురించి.. అదే 6 గ్యారెంటీలు!! మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ‘మహాలక్ష్మీ’ స్కీమ్ ఇప్పటికే అమల్లోకి వచ్చింది. ప్రజల వైద్య చికిత్సలకు సాయం చేసే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు కూడా పెంచేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా త్వరలోనే అమల్లోకి తేబోతున్నారు. అయితే ఈ పథకాలకు ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై క్లారిటీకి వచ్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్‌ చివరి వారం నుంచి జనవరి మొదటివారం వరకు  అభయహస్తం అప్లికేషన్లను స్వీకరించింది. తెలంగాణవ్యాప్తంగా కోటి మందికిపైగా అభయహస్తం అప్లికేషన్లు(Door To Door Survey) ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join

ఎంపిక ప్రక్రియ కంప్లీట్ అయ్యాక..

అభయ హస్తం ఫామ్‌లు నింపి అప్లై చేసిన వారిలో అర్హులను గుర్తించే పనిలో ఇప్పుడు అధికారులు  ఉన్నారు. ఇందులో భాగంగా డోర్ టు డోర్ సర్వేకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సిబ్బంది త్వరలోనే దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి వివరాలను సేకరిస్తారు. ఇలా ఇంటికి వచ్చే అధికారులు దరఖాస్తుదారుల నుంచి వివరాలన్నీ సేకరిస్తారు. దరఖాస్తుదారులు ఇచ్చిన పత్రాలను పరిశీలిస్తారు. కొన్ని ఐడీలు, ప్రూఫ్‌లు కూడా చూపించమని కోరుతారు. అందువల్ల అప్లై చేసుకున్నవారు.. తమ దగ్గరున్న ఐడీలూ, ప్రూఫ్‌లూ సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాతే లబ్ధిదారుల ఎంపిక కంప్లీట్ అవుతుంది.  ప్రభుత్వ సిబ్బంది ఎప్పటి నుంచి ఇళ్లకు వస్తారో ఇంకా అధికారిక తేదీ ప్రకటించలేదు. ఐతే.. వారు వచ్చినప్పుడు మాత్రం.. పరిశీలన చాలా వేగంగా చేస్తారు. అన్నీ త్వరగా పరిశీలిస్తారు. ఎక్కువ టైమ్ ఇవ్వరు. అందువల్ల వారు వచ్చాక, అన్ని పత్రాలూ రెడీ చేసుకునే కంటే.. ముందుగానే అన్నీ సిద్ధంగా ఉంచుకుంటే.. త్వరగా పనైపోతుంది. అనంతరం  దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను https://prajapalana.telangana.gov.in/ సైట్‌లో చూసుకోవచ్చు.

Also Read : Poonam Pandey : నటి పూనమ్ పాండే కన్నుమూత.. 32 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు

దరఖాస్తుదారులు ఏమేం చూపించాలి ?

  • అభయహస్తం కోసం అప్లై చేసుకున్న వారి దగ్గర అడ్రెస్ ప్రూఫ్ ఉండాలి.  ఆధార్ లేదా వయసు నిర్ధారిత పత్రాన్ని చూపించాలి.
  • వార్షిక ఆదాయం రూ.1.15 లక్షలకు మించి ఉండకూడదు.
  • ఆదాయ ధృవీకరణ పత్రం దగ్గర ఉంచుకోవాలి.
  • అభయహస్తం అప్లికేషన్‌తో పాటు ఏయే పత్రాలను సబ్మిట్ చేశారో, వాటి ఒరిజినల్ పత్రాలు కూడా దగ్గర ఉండాలి.