Site icon HashtagU Telugu

Dil Raju : సినీ పరిశ్రమకు రాజకీయాలను ఆపాదించొద్దు.. కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్‌ రాజు రియాక్షన్

Dil Raju Film Industry Ktr Cm Revanth

Dil Raju : ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ దిల్‌ రాజు  లేటెస్టుగా చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌తో సినీ పరిశ్రమ ప్రముఖుల సమావేశం గురించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌ను దిల్ రాజు తప్పుపట్టారు. అనవసర వివాదాల్లోకి చిత్ర పరిశ్రమను లాగొద్దని కేటీఆర్‌ను ఆయన కోరారు. సినీ పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మనవి చేశారు. రాజకీయ దాడులు, ప్రతిదాడులకు వేదికగా మూవీ ఇండస్ట్రీని వాడుకోవద్దని దిల్ రాజు కోరారు. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం అవసరమని దిల్ రాజు తెలిపారు. ప్రజలందరి ప్రోత్సాహం తమకు ఎప్పటికీ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ హోదాలో దిల్‌ రాజు  ఇవాళ ఒక ట్వీట్ చేశారు.

Also Read :Kekius Maximus : ఎలాన్ మస్క్ పేరు ఇక ‘కేకియస్‌ మాక్సిమస్‌’.. ఎందుకు ?

‘‘సీఎం రేవంత్‌తో జరిగిన సమావేశం ఓపెన్. అది చాటుమాటున జరగలేదు. సినీ  పరిశ్రమ బాగోగుల గురించి స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నాం. ఆ సమావేశం గురించి మేం చాలా సంతృప్తిగా ఉంది.  తెలంగాణ అభివృద్ధి పయనంలో చిత్రపరిశ్రమ పాత్రను సీఎం రేవంత్  కొనియాడారు. తెలంగాణ అభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి సినీ పరిశ్రమ వైపు నుంచి సహకారం అందించాలని సీఎం కోరారు’’ అని దిల్‌ రాజు(Dil Raju)  వెల్లడించారు.

Also Read :Country Wise New Year: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముందుగా, ఆలస్యంగా జరిగే దేశాలివీ

కేటీఆర్‌ సోమవారం రోజు మాట్లాడుతూ.. ‘‘ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి అందరి దృష్టిని మరల్చేందుకే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడారు.  సినిమా వాళ్లతో సీఎం రేవంత్‌ రెడ్డి సెటిల్ చేసుకొని ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలకు స్పందనగా ఇవాళ దిల్‌ రాజు ట్వీట్ చేశారు.