Govt Vs Overthrowing : ‘‘ఆ ఎమ్మెల్యేలను కొనేందుకు అవసరమైన ఖర్చును భరిస్తామని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు మాతో అంటున్నారు’’ అంటూ ఇటీవలే తెలంగాణలోని ఒక ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వీటిపై రాజకీయ వివాదం రాచుకుంది. మీడియాలోనూ వాడివేడి చర్చ నడిచింది. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము, ధైర్యం బడా బిల్డర్లు, పారిశ్రామికవేత్తలకు ఉందా ? అనే అంశంపై జనంలో సైతం డిస్కషన్ మొదలైంది. ఈ ఆసక్తికర అంశంపై మనమూ ఒక లుక్ వేద్దాం..
Also Read :Arsenic Alert : మనం తినే బియ్యంలో డేంజరస్ ఆర్సెనిక్.. ఏమిటిది ?
కేవలం రూ.1.65 కోట్ల ఆస్తులతో ప్రధానిగా మోడీ
రాజకీయానికి డబ్బుతో లింక్ పెట్టడం సరికాదు. రాజకీయం అనగానే డబ్బును ఊహించుకోవడం అస్సలు కరెక్టు కాదు. 2014లో మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే సమయానికి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ కేవలం రూ.1.65 కోట్లే. ఆ సమయానికే వందల కోట్లు, వేల కోట్ల ఆస్తులు కలిగిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఎంతోమంది ఉన్నారు. అయినా అలాంటి సంపన్నులకు కాకుండా, నరేంద్ర మోడీనే ప్రధాని పదవి వరించింది. దీనికి కారణం.. ఆయనలోని నాయకత్వ పటిమ, ప్రభావశీల తత్వం. బీజేపీ పేరెంట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ మోడీ గణనీయంగా ప్రభావితం చేశారు. తన వైపే మొగ్గుచూపేలా వాతావరణాన్ని ఏర్పరిచారు. బీజేపీలోని మెజారిటీ అగ్రనేతలు తనకు అనుకూలంగా నిలిచేలా ముందస్తు వ్యూహంతో పావులు కదిపారు. అంతకుమించి ఎన్నికల ప్రచారంలో సరికొత్త ప్రణాళికలతో ప్రజలకు చేరువయ్యారు. వీటన్నింటి ఫలితంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధ్యమైంది. మోడీ ప్రధాని కాగలిగారు. డబ్బు కంటే టీమ్ వర్క్ ముఖ్యమని ఆనాడు మోడీ నిరూపించారు. మొరార్జీ దేశాయ్, మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి లాంటి గొప్ప నేతలు కేవలం తమ నాయకత్వ పటిమతోనే మన దేశానికి ప్రధానులు అయ్యారు. వారికి అదానీ, అంబానీల లాంటి రిచ్ నేపథ్యమేదీ లేదు.
Also Read :MP Mithun Reddy : లిక్కర్ స్కాం.. మిథున్‌రెడ్డిని 8 గంటల్లో ‘సిట్’ అడిగిన కీలక ప్రశ్నలివీ
అదంతా నల్లధనమేనా ?
ఐపీఎల్‌లో(Govt Vs Overthrowing) క్రికెట్ ప్లేయర్లను రేటు కట్టి కొంటారు. ఆ విధంగా రేటు కట్టి ప్రజాప్రతినిధులను కొనే దుస్థితి ఇంకా రాలేదు. అలాంటి నీచం చేయడానికి మన చట్టాలు అస్సలు అనుమతించవు. అలా చేసేందుకు యత్నించినా కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే భారీగా నిధులు కావాలి. న్యాయమైన ధనమున్న వారెవరూ ఈ నీచానికి తెగబడరు. నల్లధనం ఉంటేనే ఇలాంటి వ్యవహారాలకు తెగబడతారు. నల్లధనంతో ప్రభుత్వాలను కూల్చే ఆలోచన చేసినా, వ్యాఖ్యలు చేసినా కఠినంగా శిక్షించాలి. లేదంటే సభ్య సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ప్రజల మదిలో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి.