DK Aruna: డీకే అరుణ ఆస్తి వివరాలు, భర్తకు 82 వాహనాలు

మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆమెకు, ఆమె భర్తకు ట్రక్కులు, కార్లు సహా 82 వాహనాలున్నట్లు పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
DK Aruna

DK Aruna

DK Aruna: మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో ఆమెకు, ఆమె భర్తకు ట్రక్కులు, కార్లు సహా 82 వాహనాలున్నట్లు పేర్కొన్నారు. ఆమె భర్త డీకే భరత్ సింహారెడ్డి పేరున్న కాంట్రాక్టర్. డీకే అరుణ గతంలో ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ నుంచి ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తి విలువ రూ.66.4 కోట్లు కాగా, ప్రస్తుతం ఆమె ఆరు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

We’re now on WhatsAppClick to Join

డీకే అరుణ అసలు పేరు అరుంధతి.1960, మే 4 న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా ధన్వాడ గ్రామంలో జన్మించారు. అరుణ చిన్ననాటి నుంచే రాజకీయాలను చూస్తూ పెరిగారు. తండ్రి నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నక్సలైట్లు దాడిలో మరణించారు. తండ్రి మరణాంతరం రాజకీయాల వైపుగా పయనించారు. ఆమె కుటుంబంలోనూ ఎమ్మెల్యేలుగా పని చేసిన నేతలున్నారు. మామ సత్యారెడ్డి, భర్త భరతసింహారెడ్డి, బావ సమరసింహారెడ్డి ముగ్గురు గద్వాల్ ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేసినవారే. ఇలా ఆమె ఎటు చూసినా పొలిటికల్ వాతావరణమే.

Also Read: Jersey Rerelease : నాని తో కలిసి జెర్సీ సినిమా చూస్తారా..?

  Last Updated: 19 Apr 2024, 11:01 PM IST