DK Aruna : సీఎం రేవంత్ ను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చిన డీకే అరుణ

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 04:21 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth ) ఫై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) విరుచుకపడ్డారు. పాలమూరు సభ (Palamuru Meeting)లో రేవంత్ మాట్లాడిన తీరు చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు గుర్తువస్తున్నాయని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి తాను సీఎం హోదాలో ఉన్నానని మర్చిపోయి..ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని అరుణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క పెద్దన్న అంటూనే ఆ మరుసటి రోజే మోడీ – కేడీ అంటున్నారని, ఇది ఆయన కున్న సంస్కారానికి నిదర్శనమని డీకే అరుణ మండిపడ్డారు

We’re now on WhatsApp. Click to Join.

కాంగ్రెస్ లో రేవంతే మరో ఏక్ నాథ్ షిండే అవ్వొచ్చు అనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కేసీఆర్ కూడా అహంకారపూరిత మాటలు మాట్లాడి ఇప్పుడు ఎక్కడున్నారో చూసాం. బీఆరెస్, బీజేపీ ఒక్కటే అంటూ తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది, మీకు గుర్తులేదా? 60 ఏళ్ళు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ మహిళలకు మరుగుదొడ్లు కట్టించి ఇచ్చాము. రేవంత్ కు దమ్ముంటే ఇచ్చిన అరు గ్యారంటీలు అమలు చేసి చూపండి. మోడీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయిందో లేదో అప్పుడే అహంకారం వచ్చిందా? మోదీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే మైలేజీ వస్తుంది అనుకుంటున్నావేమో ఖబర్ధార్ రేవంత్ రెడ్డి. నోటికొచ్చినట్లు మాట్లాడితే వెంటపడి తరిమేస్తాం” అంటూ అరుణ హెచ్చరించింది.

‘డీకే అరుణ ఆనాడు పోరాడి జీవో తీసుకురాకపోతే పాలమూరు రంగారెడ్డి ఉండేది కాదు. పాలమూరు రంగారెడ్డి కోసం రేవంత్ రెడ్డి చేసింది ఏంటో చెప్పాలి. పాలమూరు అభివృద్ధికి కృషి చేసింది నేను. విద్యాలయాలు, సాగునీటి ప్రాజెక్ట్స్, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేసింది మేము. కాంగ్రెస్ నాయకులకు పాలమూరులో ఓట్లు అడిగే హక్కు లేదు. 2014 పాలమూరు ప్రాజెక్ట్ డిసైన్ ఏంటి? ఇప్పుడున్న మార్చిన డిసైన్ కు కాంట్రాక్టర్ లకు వంత పాడుతున్నారా? పాలమూరు ప్రాజెక్ట్ ప్రతిపాదనలే మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాంతాల కోసం కదా? అదే లిఫ్ట్ ద్వారా కల్వకుర్తికి నీళ్లేందుకు తీసుకుపోతున్నారో చెప్పాలి. పాలమూరు అభివృద్ధి కోసమే పోరాడిందే నేను కదా ఈ విషయం జిల్లాలో ఎవర్ని అడిగిన చెప్తారు” అంటూ పేర్కొంది.\

Read Also : Maldives : మాల్దీవులకు భారతీయులు వెళ్లడమే తగ్గించేసారట..