Digvijay Singh: పార్టీ నేతలను చేతులు జోడించి కోరుతున్నా.. దిగ్విజయ్ రిక్వెస్ట్..!

నేతలంతా పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) సూచించారు. నేతల మధ్య తలెత్తిన విబేధాల నేపథ్యంలో వారందరితో మాట్లాడిన తర్వాత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Written By:
  • Publish Date - December 23, 2022 / 12:11 PM IST

నేతలంతా పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలని దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) సూచించారు. నేతల మధ్య తలెత్తిన విబేధాల నేపథ్యంలో వారందరితో మాట్లాడిన తర్వాత దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్య ఏమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. చేతులు జోడించి ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. అంతా కలిసి కట్టుగా ఉంటేనే ప్రత్యర్థులను ఓడించగలమని చెప్పారు. కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణ లేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. ప్రజలను కూడా ఆయన మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో రికార్డు బద్దలు కొడుతోందని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి వారి పార్టీలో చేర్చుకున్నారని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ విచారణల పేరుతో నిర్ధోషులను వేధిస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ హింసా, ధ్వేషాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. ఆయన విధానాలు సంపన్నులకే ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విశేష స్పందన వస్తోందని చెప్పారు.

Also Read: TSPSC Group 4: తెలంగాణ గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కొత్త తేదీలివే.!

సీనియర్, జూనియర్ అనే తేడా లేదని పార్టీ నేతలకు దిగ్విజయ్ సింగ్ సూచించారు. కష్టపడే వారిని పార్టీ కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. ఏవైనా అంతర్గత గొడవలు ఉంటే లోపల చర్చించుకోవాలని సూచించారు. పార్టీ లైన్‌కు నేతలంగా కట్టుబడి ఉంటాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతా సెట్ అయిపోయిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఇక ఎలాంటి సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. సీనియర్, జూనియర్ అనే ప్రస్తావన సరైంది కాదని అన్నారు. విభేదాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. ‘‘ఆల్ సెటిల్డ్.. నో ప్రాబ్లెమ్’’ అంటూ తన ప్రెస్ మీట్ ముగించారు.