Site icon HashtagU Telugu

Sritej Health Condition: శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు.. కిమ్స్ అలా.. మంత్రి ఇలా!

Sritej Health Condition

Sritej Health Condition

Sritej Health Condition: పుష్ప‌-2 ప్రీమియ‌ర్ షో సంద‌ర్భంగా సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన శ్రీతేజ్ (Sritej Health Condition) గ‌త 15 రోజులుగా కిమ్స్ ఆస్ప‌త్రిలోనే చికిత్స పొందుతున్నాడు. అయితే శ్రీతేజ్ ఆరోగ్య ప‌రిస్థితిపై భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి. శ‌నివారం శ్రీతేజ్ ఆరోగ్యం గురించి కిమ్స్ వైద్యులు బులెటిన్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. అందులో శ్రీతేజ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని పేర్కొన్నారు.

ఆరోగ్య పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు

కిమ్స్ ఆసువత్రి వర్గాలు శ్రీతేజ్ ప‌రిస్థితి కొంత మెరుగ్గా ఉందని బులెటిన్‌ను విడుద‌ల చేస్తే.. శ‌నివారం సాయంత్రం బాలుడ్ని ప‌రామ‌ర్శించిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాత్రం శ్రీతేజ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్యం కొంత మెరుగుపడిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసుపత్రికి వెళ్తే కొద్దిసేపటి క్రితమే హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పిన మాటలను బట్టి శ్రీతేజ ఆరోగ్యం కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.

Also Read: Allu Arjun Jail Again: అల్లు అర్జున్‌ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమా? పోలీసులు ఏం చేయ‌బోతున్నారు!

కోమ‌టిరెడ్డి ఏమ‌న్నారంటే?

డాక్టర్లతో చర్చించిన అనంతరం మంత్రి కోమటిరెడ్డి శ్రీతేజ్ ఆరోగ్య ప‌రిస్థితి గురించి మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి చూస్తే భయం వేస్తుందని, పూర్తిగా కోలుకోవడానికి 2 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కోలుకున్నా మాటలు వస్తాయో రావో తెలియదని మంత్రి అన్నారు. అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏంటంటే.. ఇక్క‌డ అల్లు అర్జున్ టీమ్ కానీ కిమ్స్ డాక్టర్స్ కానీ శ్రీతేజ కుటుంబ సభ్యులను మీడియాకి దూరంగా ఉంచడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. శ్రీతేజ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఇప్పటికే కుటుంబ సభ్యులకు డాక్టర్స్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. బాలుడికి అయ్యే వైద్య ఖ‌ర్చును మొత్తాన్ని ప్రభుత్వమే భ‌రిస్తుంద‌ని మంత్రి కోమ‌టిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా మంత్రి సొంతంగా శ్రీతేజ్‌ కుటుంబానికి రూ. 25 లక్షలు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సహాయం అందించారు. ప్ర‌భుత్వం సైతం రూ. 25 ల‌క్ష‌లు అందించ‌నుంది.

అయితే శ్రీతేజ్ ప‌రిస్థితి నిల‌క‌డగానే ఉంటే మంత్రి పై వ్యాఖ్య‌లు ఎందుకు చేశార‌నేది ఇప్పుడు అందరిలో మెదిలే ప్ర‌శ్న‌. మంత్రి వ‌స్తున్నార‌ని కిమ్స్ వైద్యులు కావాలనే అలాంటి హెల్త్ బులెటిన్‌ని విడుద‌ల చేశారా? లేక మంత్రే అలా చెప్పారా? శ్రీతేజ్ కోసం మెడిసిన్లు అమెరికా నుంచి అయినా తెప్పిస్తామ‌న్న మంత్రి మాట‌లు చూస్తే శ్రీతేజ్ ఆరోగ్యం ఇంకా విష‌మంగానే ఉందా? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చిక్క‌డంలేదు.