సినీ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna ) పై సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కక్ష్య కట్టాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ అభిమానులు , విపక్షాలు. ఇండస్ట్రీ లో చాల కూల్ పర్సన్ అంటే నాగార్జునే అని ప్రతి ఒక్కరు చెపుతారు. ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా తన సినిమాలు ఏంటో..తన బిజినెస్ ఏంటో అంతే తప్ప ఒకరిపై విమర్శలు చేయడం కానీ..నిందలు వేయడం కానీ చేయడు. మీడియా తో కూడా చాల క్లోజ్ గా ఉంటారు. అలాంటి వ్యక్తి తప్పు చేసాడని చెప్పి ఆయనకు సంబదించిన ఎన్ కన్వెన్షన్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చేసింది రేవంత్ సర్కార్.
కోర్టు నుంచి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కట్టడాలను కూల్చివేయడంపై నాగార్జున తన ఆవేదనను వ్యక్తం చేశారు. అది పూర్తిగా ప్రైవేటు భూమి అని, అంగుళం కూడా చెరువు భూమిని తాము ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఇది కోర్ట్ చూసుకుంటుందని అని చెప్పి ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు.
ఇటీవల మంత్రి సురేఖ (Konda Surekha) అక్కినేని కుటుంబం, సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో మరోసారి నాగార్జున పేరు హాట్ టాపిక్ గా మారింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై యావత్ ఫిలిం ఇండస్ట్రీ తో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తర్వాత సురేఖ తన మాటలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కానీ నాగార్జున మాత్రం కోర్ట్ లో సురేఖ పై పరువు నష్టం దావా వేశారు. ఈ విషయంలో సైలెంట్ అనేది లేదని..దావా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఫిక్స్ అయ్యాడు.
ఈ తరుణంలో నాగార్జున కు మరో షాక్ ఇచ్చారు రేవంత్. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నాగార్జునపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. జనంకోసం అనే సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున సురేఖ విషయంలో సైలెంట్ అయ్యేలా చేసేందుకే ఇలా కేసు పెట్టించాడని అభిమానులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కినేని నాగార్జునపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష గట్టిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Gali Janardhan Reddy: కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య జైలుకు వెళ్లడం ఖాయం