కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు (Mynampally Hanumanth Rao) హాట్ కామెంట్స్ చేశారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని మల్లన్న సాగర్ (Mallanna Sagar) ముంపు బాధితులను మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao)పై సంచలన కామెంట్స్ చేశారు. రీజినల్ రింగు రోడ్డు (RRR) ప్రాజెక్ట్ నుంచి హరీష్ భూములు తప్పించారని ఆరోపించారు. షాద్‌నగర్ ప్రాంతంలో హరీష్ రావుకు భూములున్నాయని.. రెండు రోజుల్లో ఆ భూముల దగ్గరకు వెళ్తానని చెప్పారు. హరీష్ భూముల్లో నుంచి వెళ్లకపోతే.. సీఎం రేవంత్ (CM Revanth Reddy) ఇంటి ముందు ధర్నా చేస్తానని కీలక కామెంట్స్ చేశారు.
ఇక, మూసీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని…బీఆర్ఎస్ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దన్నారు. బాధితులను ఆదుకునేందుకు తనతోపాటు తన భార్య ఆస్తిని రాసిస్తానని, కేటీఆర్, హరీష్ రావులు కూడా వారి ఆస్తిని బాధితులకు రాసి ఇచ్చేందుకు రెడీనా అంటూ సవాల్ చేశారు. హైదారాబాద్‌లో అక్రమ కట్టడాలు కట్టితే నిర్ధాక్షణంగా కూల్చేస్తామని ఆనాడు కేసీఆరే అన్నారని గుర్తు చేశారు. మూసీ నది క్లీన్ చేయడం వల్ల ఎంతో లాభం ఉంటుందని అన్నారు.
Read Also : Supreme Court : జస్ట్ అస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్