Medaram : తన భర్త బెట్టింగ్ మానేసేయాలా చూడాలంటూ సమ్మక్కకు చీటి రాసిన భక్తురాలు

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 01:46 PM IST

మేడారం హుండీలో ఏపీకి చెందిన ఓ భక్తురాలు తన భర్త బెట్టింగ్ మానేసేయాలా చూడాలంటూ అమ్మవార్లకు చీటి రాయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మేడారం (Medaram) హుండీల డబ్బు లెక్కింపు (Hundi Collection 2024) ప్రక్రియ గురువారం నుండి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హన్మకొండ లోని TTD కల్యాణ మండపంలో హుండీల లెక్కింపు చేస్తున్నారు. మొత్తం 518 హుండీల లెక్కింపు జరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

మొదటి రోజు రూ.3.15 కోట్ల ఆదాయం రాగా… రెండో రోజు శుక్రవారం 2.98 కోట్ల ఆదాయం , మూడో రోజు రూ.3.46 కోట్ల ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 317 హుండీలను లెక్కించగా రూ.9.60 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో రాజేంద్రం వివరించారు. 71 ఇనుప హుండీల్లో కరెన్సీ, చిల్లర నాణెలు, వెండి, బంగారాన్ని వేరు చేశామని వెల్లడించారు.ఈ మొత్తాన్ని ఎండోమెంట్ అధికారులు బ్యాంకులో జమ చేశారు. ఈ హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మరో నాల్గు రోజుల పాటు జరగనుందని అధికారులు చెపుతున్నారు. 150 మంది దేవాదాయ శాఖ సిబ్బంది, 200 మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు హుండీ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కౌంటింగ్ కొనసాగనుంది. తాజాగా అమ్మవారి హుండిలో ఓ చీటి కనిపించింది. అందులో ఒకావిడ తన భర్త గురించి రాసి హుండీలో వేసింది. తన భర్త బెట్టింగ్ మానేశాయలని చూడాలంటూ అమ్మవారిని కోరుకుంటూ చీటి రాసింది. పాపం బెట్టింగ్ వల్ల ఆ వివాహిత ఎంత ఇబ్బంది పడిందో.. అందుకే అమ్మవారికి ఏకంగా చీటి రాసి వేడుకుందని అంత మాట్లాడుకుంటున్నారు.

ఫిబ్రవరి 21 నుంచి 24 వరకూ మేడారం జాతర ఘనంగా జరగ్గా.. 1.40 కోట్ల మంది భక్తులు వనదేవతల్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు తెలిపారు. జాతరలో సమ్మక్క గద్దెల వద్ద 215, సారలమ్మ గద్దెల సమీపంలో 215, పగిడిద్దరాజు గద్దెల వద్ద 26, గోవిందరాజు గద్దె వద్ద 26, మరో 30 క్లాత్ హుండీలను ఏర్పాటు చేశారు. తిరుగువారం నేపథ్యంలో.. సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మరో 23 హుండీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హుండీల లెక్కింపు జరుగుతుంది.

Read Also : BJP Telangana MP List : తెలంగాణ బీజేపీలో మొదలైన అసమ్మతి సెగలు