Kondagattu : ఉచిత బస్సు కింద పడి భక్తుడికి గాయాలు

భక్తుల కోసం దిగువ కొండగట్టు నుండి గుట్ట పైకి దేవస్థానం అధికారులు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించారు

  • Written By:
  • Publish Date - April 23, 2024 / 01:49 PM IST

కొండగట్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉచిత బస్సు కింద భక్తుడు పడి రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఈరోజు హనుమాన్ జయంతి (Hanuman Jayanti) సందర్బంగా తెలంగాణ లోని కొండగట్టు (Kondagattu Hanuman Temple) ఆలయానికి నిన్న రాత్రి నుండి భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలిరావడం తో అంజన్న దర్శనానికి రెండు , మూడు గంటలు పడుతుంది.

ఇక హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు స్వామి దర్శనానికి వచ్చిన భక్తుడు ప్రమాదానికి గురికావడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. భక్తుల కోసం దిగువ కొండగట్టు నుండి గుట్ట పైకి దేవస్థానం అధికారులు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభించారు. ఈ క్రమంలో నేడు ఓ భక్తుడు..బస్సు ఎక్కుతూ కింద పడడంతో అతడి కాళ్లపై నుండి బస్సు చక్రాలు వెళ్లడం తో రెండు కాళ్లు నుజ్జునుజయ్యాయి. వెంటనే భక్తుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెద్ద మొత్తంలో తరలివస్తున్న భక్తులు బస్సు ఎక్కేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కొండగట్టు ఆలయం విషయానికి వస్తే..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో 15 కీలో మీటర్ల దూరంలో మలయాళ మండలం ముత్యంపేట గ్రామానికి దగ్గర్లోని కొండగట్టు మీద ఈ ఆలయం కొలువుదీరి ఉంది. ఇక్కడ హనుమాన్ రూపం చాలా మహిమాన్వితమైంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. చాలా అరుదైన రూపం కూడా.. చాలా ప్రాంతాలలో ఏక రూపంలో కనిపించే హనుమంతుడు కొన్ని చోట్ల త్రిముఖాలు, మరికొన్ని చోట్ల పంచ ముఖాలతో దర్శనమిస్తాడు. ఇక్కడ మాత్రం చాలా ప్రత్యేకంగా ద్విముఖాలతో దర్శనమిస్తాడు. ఒకటి ఆంజనేయ స్వామి ముఖం కాగా మరొకటి నారసింహ స్వామి ముఖం. రెండు ముఖాలతో నారసింహ శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతామాతలతో కూడిన రూపం ఇక్కడి ఆండనేయుడి ప్రత్యేకత. అందుకే కొండ అంజన్న అంటే అందరికి అంత భక్తి… నమ్మకం .. దైర్యం. ఆయన ఆశీర్వాదం లభించిందంటే చాలు కొండంత ధైర్యం వచ్చింనట్లేనని నమ్ముతుంటారు. ఆంజనేయుడి మూల మూర్తి దర్శనంతో భూతప్రేత పిశాచాల పీడల నుంచి కూడా విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. నిత్య అభిషేకాలు, వార్షిక ఆరాధన ఉత్సవాలు,శ్రీరామ నవమి, ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.

Read Also : Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం