Professor Kodandaram: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాంకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద షాకే తగిలింది. ఆయన ప్రచారం చేసిన అభ్యర్థులు పెద్దగా ఫలితాలను సాధించలేకపోయారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన పన్నాల గోపాల్ రెడ్డికి కోదండరాం మద్దతు ప్రకటించారు. అయితే పన్నాలకు కేవలం 24 ఓట్లే వచ్చాయి. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలలో 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున లెక్క వేసుకున్నా.. కనీసం 34 ఓట్లయినా రావాలి. కానీ అలా జరగలేదు. దీంతో ఎమ్మెల్సీ కోదండరాం క్యాడర్ , సన్నిహితులు షాకయ్యారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాంను(Professor Kodandaram) ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న కోదండరాం ప్రచారం చేసిన చోట ఈ తరహా ఫలితం రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం నిరాశకు గురయ్యాయి.
Also Read :Hyderabad Expansion: హైదరాబాద్ ‘మహా’ విస్తరణ.. ఎక్కడి వరకో తెలుసా ?
తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా..
అసలు విషయం ఏమిటంటే.. పన్నాల గోపాల్ రెడ్డి తెలంగాణ జనసమితి పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫునే పోటీ చేయాలని పన్నాల ఒత్తిడి చేశారట. అయితే కుదరలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. పన్నాలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఎన్నికల ప్రచారానికి కోదండరాం వెళ్లారు.
ముందస్తు వ్యూహం మస్ట్
ఎమ్మెల్సీలను నామినేట్ చేయడం ఈజీయే. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యక్షంగా ఓటర్ల మనసులను గెలవడం అనేది చాలా టఫ్ విషయం. వీలైనంత ఎక్కువ మంది ఓటర్ల మదిని గెలిస్తేనే విజయం వరిస్తుంది. ఇందుకోసం ముందునుంచే కొంత గ్రౌండ్ వర్క్ అవసరం. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీచర్లను ఆకట్టుకునే వ్యూహాలు ఉండాలి. వారికి భరోసా కల్పించేలా ముందుకు సాగాలి. అలా అయితేనే మెరుగైన ఫలితాన్ని సాధించడం వీలవుతుంది. ఇవన్నీ జరగకుండా కేవలం ప్రచారంతో ఎన్నికల ఫలితం వస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్టే.