Medigadda Flaws Exposed : మేడిగడ్డ లోపాల పుట్ట.. ఐఐటీ రూర్కీ అధ్యయనంలో వెల్లడి

కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Flaws Exposed).  దీనికి మూలస్తంభమైన సీకెంట్ ​పైల్స్​లోనూ లోపాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Medigadda Design Flaws Exposed Kaleshwaram Barrage Iit Report

Medigadda Flaws Exposed : బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై ఐఐటీ రూర్కీ సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ బ్యారేజీలోని డిజైన్లు, మోడల్ స్టడీస్, జియో టెక్నికల్ అంశాలు లోపాల పుట్టగా ఉన్నాయని తేల్చింది. దీన్ని నిర్మించే ముందు సరైన పరిశోధన చేయలేదని ఐఐటీ రూర్కీ నిపుణులు వెల్లడించారు. హైడ్రాలజీ, హైడ్రాలిక్స్​ (గేట్లకు సంబంధించిన అంశాలు), జియోటెక్నికల్​ డిజైన్లపై అధ్యయనం చేసి రూపొందించిన ఈ నివేదికలోని కీలకమైన అంశాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Caste Survey : కులగణన సర్వే తుది నివేదిక.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఐఐటీ రూర్కీ నివేదికలోని కీలక వివరాలివీ..

  • కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Flaws Exposed).  దీనికి మూలస్తంభమైన సీకెంట్ ​పైల్స్​లోనూ లోపాలు ఉన్నాయి.
  • బ్యారేజీకి సంబంధించిన పలు పనులను ‘ఇండియన్​ స్టాండర్డ్​ కోడ్స్’​ ప్రకారం చేపట్టలేదు.
  • మేడిగడ్డ  బ్యారేజీలోని 11 గేట్ల వద్ద జియోటెక్నికల్​ ఇన్వెస్టిగేషన్స్​ చేయాలి. కానీ 5 గేట్ల వద్దే ఈ టెస్టులు చేశారు.  బ్యారేజీలోని ఏడో బ్లాక్​లో 33, 34, 35, 36, 37వ నంబర్ ​ గేట్ల వద్ద బోర్​ హోల్స్​ టెస్టులు చేశారు. 24 మీటర్ల నుంచి 26 మీటర్ల లోతు వరకు బోర్​హోల్స్​ తవ్వి, టెస్టులను నిర్వహించారు. ఐఎస్ కోడ్స్ ప్రకారం గేట్ల వద్ద జియో టెక్నికల్ పరిశోధన చేయలేదు.
  • సీకెంట్​ పైల్స్​ కటాఫ్​ (బ్యారేజీలో లీకేజీలు, సీపేజీలు ఏర్పడకుండా భూమిలోపల ఏర్పాటు చేసే ఫౌండేషన్​లాంటి ప్రొటెక్షన్​ వాల్​) ఐఎస్​ కోడ్​ ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని గుర్తించారు. సీకెంట్​పైల్స్​పై పడే వరద ప్రవాహ ఒత్తిడిని లెక్కలోకి తీసుకోకుండానే వాటిని నిర్మించారు.
  • అప్​స్ట్రీమ్​, డౌన్​స్ట్రీమ్​లలో రాక్ ​మ్యాపింగ్​ చేయకుండానే సీకెంట్​ పైల్స్​ను నిర్మించారు.
  • లాంచింగ్​ ఆప్రాన్​ మందం బ్యారేజీ వరదలకు సరిపోదని గుర్తించారు. దిగువన ఒక మీటర్​, ఎగువన 1.2 మీటర్ల మందంతోనే లాంచింగ్​ ఆప్రాన్లను ఏర్పాటు చేశారు.
  • ఐఎస్​ కోడ్స్​ స్టాండర్డ్స్​​ ప్రకారం కనీసం 1.86 మీటర్ల మందం ఉండాలి. అయితే సీసీ బ్లాకుల పొడవు కూడా సరిపోనూ లేదని నివేదికలో పొందుపరిచారు.
  • బ్యారేజీ ఫౌండేషన్ సీకెంట్ పైల్స్‌ను సరిగ్గా నిర్మించలేదు. దిగువన రాఫ్ట్, పైల్స్‌కు మధ్య కనెక్షన్ లేక రంధ్రాలు పడ్డాయి. చివరకు లీకేజీకి దారి తీసింది.
  • బ్యారేజీని నిర్మించే క్రమంలో ఇసుక సెడిమెంటేషన్‌తో పాటు మరికొన్ని స్టడీస్ చేయలేదు.

Also Read :Union Budget Facts : బ్లాక్ బడ్జెట్, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్.. భారత బడ్జెట్ విశేషాల చిట్టా ఇదిగో

  Last Updated: 29 Jan 2025, 07:53 PM IST