Site icon HashtagU Telugu

Warangal Meeting : కేసీఆర్ కు దావత్ ఇద్దామంటే కనిపించడం లేదు – భట్టి సెటైర్లు

Bhatti Wgl Sabha

Bhatti Wgl Sabha

కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవ సభలో(Praja Palana Sabha ) డిప్యూటీ సీఎం భట్టి (Dy CM Bhatti ) తనదైన శైలిలో కేసీఆర్ పై సెటైర్లు వేశారు. మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇదే వరంగల్ జిల్లాలో పర్యటించి తానే కుర్చివేసుకుని కూర్చుని జర్నలిస్టు కాలనీ కట్టిస్తానని , దావత్ కూడా కావాలని అడిగారని… కానీ ఆయన కుర్చీ వేసుకున్నది లేదు కాలనీ కట్టింది లేదు. అసలు దావత్ ఇద్దామంటే కేసీఆర్ కనిపించడం లేదని సెటైర్ వేశారు.

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నేటికీ ఏడాది పూర్తి అవుతున్న సందర్బంగా హనుమకొండలోని ఆర్ట్స్​ అండ్​ సైన్స్​ కళాశాల మైదానంలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , పలువురు మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఇలా అందరు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తంగా మారిస్తే తాము దాన్ని చక్కదిద్దుతున్నామన్నారు. వరంగల్ అభివృద్ధికి దాదాపు 6 వేల కోట్ల నిధులను మంజూరు చేశామని, ఇది తెలంగాణ చరిత్రలోనే ఓ పట్టణాన్ని మహానగరంగా మార్చేందుకు చేస్తున్న ప్రక్రియ అని గుర్తు చేసారు. తాము మాటలు చెప్పి వెళ్లడానికి రాలేదని.. ఇది కాంగ్రెస్ నిబద్ధత అన్నారు. వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ. లక్ష వడ్డీ లేని రుణాలు ఇస్తామని మన రాష్ట్రంలో గ్రీన్ పవర్ తీసుకొస్తామన్నారు. 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు చేశామని ఈ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశం మహిళలకు కల్పిస్తున్నామన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఇదే వరంగల్ జిల్లాలో పర్యటించి తానే కుర్చివేసుకుని కూర్చుని జర్నలిస్టు కాలనీ కట్టిస్తానని మాట ఇచ్చాడు. దావత్ కూడా కావాలని అడిగారు. కానీ ఆయన కుర్చీ వేసుకున్నది లేదు కాలనీ కట్టింది లేదని..అసలు దావత్ ఇద్దామంటే కేసీఆర్ కనిపించడం లేదని సెటైర్ వేశారు. తాము వరంగల్ జిల్లాకు నిధులు ఇస్తామని మాట ఇవ్వడమే కాకుండా కేవలం ఆరు నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రం పూర్తయ్యేందుకు నిధులు కేటాయించి ఈరోజు ప్రారంభించుకున్నామని అని తెలిపారు.

Read Also : Praja Palana Sabha : కిషన్ రెడ్డి తట్టా బుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే – సీఎం రేవంత్