Site icon HashtagU Telugu

Deputy CM Bhatti Vikramarka: ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ..భట్టి విక్రమర్క

Deputy Cm Bhatti Vikramarka

Deputy Cm Bhatti Vikramarka

రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాజీవ్ యువ వికాసం, సన్న బియ్యం ఇలా ప్రతి ఇంటికి వేళల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిర నియోజకవర్గము ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు లెక్కల తో సహా త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే పదేళ్లు పాలించిన వారు రాష్ట్రాన్ని గాలికి వదిలేసారు, 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయారు. ఆదాయం లేకపోయినా, అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ మొదటి ఏడాదిలోనే పెద్ద సంఖ్యలో ప్రజల కోసం ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖకు 11,600 కోట్లు ఖర్చు పెడుతున్నాము రాబోయే రోజుల్లో వైద్య రంగానికి మరింత నిధులు కేటాయిస్తాం అన్నారు.

ఇల్లు ఇస్తామని బిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలపాటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వివరించారు. ప్రజా ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం అన్నారు. మొదటి సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు నిర్మిస్తున్నామని, ఇ 0దుకు 22,500 కోట్లు కేటాయించాం అన్నారు. అడవి హక్కు చట్టం ద్వారా పట్టా పొందిన రైతులందరికీ ఇందిరా గిరి జలవికాసం ద్వారా ఉచితంగా బోర్లు, పంప్ సెట్లు, సోలార్ విద్యుత్తు, పామ్ ఆయిల్, అవకాడో మొక్కలు ఉచితంగా అందజేస్తామన్నారు.

ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందులో భాగంగా మొదటి సంవత్సరం స్వయం సహాయక సంఘాలకు 21 వేల కోట్ల అందజేశాం అన్నారు.

రాష్ట్రంలో 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి వారందరికీ 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. గతంలో పెద్ద రోగం వస్తే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండేది అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాం, ఆధారంగా కొత్త చికిత్సలను చేర్చాం రాష్ట్ర ప్రజలకు ప్రజా ప్రభుత్వం ఇస్తున్న పెద్ద భరోసా ఇది అన్నారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి వందరోజుల పని కల్పిస్తున్నాం, అదే కుటుంబంలో పిల్లలు చదువుకునేందుకు ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తాం అన్నారు. ఈ పాఠశాల నిర్మాణానికి 11,600 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పిల్లలు చదువుకుంటే వారి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాం అన్నారు.

90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందిస్తున్నాం అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 2 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిగిస్తున్నాం అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసి ఇప్పటికే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం, మరో 30 వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబోతున్నాం అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు 9,000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకాని ప్రారంభించామని, జూన్ 2న సాంక్షన్ లెటర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ప్రయోజనం చేకూరుతుందనీ డిప్యూటీ సీఎం అన్నారు.