Jagan Shock : జగన్ ఇల్లు కూల్చివేత.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

మాజీ సీఎం జగన్ ఇంటివద్ద కూడా అక్రమంగా కట్టిన గోడలను అధికారులు కూల్చివేస్తున్నారు

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 01:23 PM IST

ఏపీలో భారీ ఓటమి తో షాక్ లో ఉన్న మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan) కు..ఇప్పుడు తెలంగాణ లో కూడా భారీ షాక్ తగిలింది. లోటస్ పాండ్ (Lotus Pond) లోని జగన్ ఇంటి వద్ద నిర్మించిన అక్రమ నిర్మాణాలను GHMC అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున JCB లతో ఈ పనులు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఇంటివద్ద అక్రమంగా కట్టిన గోడలను అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఈ నిర్మాణాలను కూల్చివేస్తునట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో కూడా GHMC అధికారులు రోడ్ ఫై అక్రమంగా కట్టడాలు కట్టారని..వెంటనే వీటిని తీసివేయాలని నోటీసులు జారీ చేసిన పెద్దగా పట్టించుకోలేదు. అప్పటికి ప్రభుత్వం కూడా ఈ విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించిందని స్థానికులు మరోసారి పిర్యాదులు చేయడం తో ఈరోజు ఉదయం JCB లతో అధికారులు వచ్చి అక్రమంగా రోడ్ ఫై కట్టిన గదులను కూల్చివేయడం స్టార్ట్ చేసారు. భారీ ఎత్తున పోలీస్ భద్రత నడుమా..ఈ పనులు చేస్తున్నారు. ఈ గదులు కట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురుకుంటున్నామని అక్కడి వారు చెపుతున్నారు.

ప్రస్తుతం జగన్ కొంతకాలంగా ఏపీలోని తాడేపల్లి గూడెం లోనే ఉంటున్నారు. హైదరాబాద్ కు రావడం మానేశారు. ఆ మధ్య ఒక్కసారిగా వచ్చి వెళ్లారు అంతే..ఇక్కడ ఉండడం లేదు. మరి ఇప్పుడు ఏపీలో అధికారం కోల్పోయాడు కాబట్టి ఏమైనా తిరిగి హైదరాబాద్ కు వస్తారేమో చూడాలి. ఏది ఏమైనప్పటికి జగన్ కు వరుస షాకులు మాత్రం నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ముందు ముందు ఇంకెన్ని షాకులు జగన్ వినాల్సి , చూడాల్సి వస్తుందో..!!

Read Also : Pawan Photos : ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబుతో పాటు పవన్ ఫొటోలు..