Site icon HashtagU Telugu

BRS : గుర్తు తెలగించాలంటూ ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ విజ్ఞప్తి

BRS Demands

BRS Demands

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తో పాటు మిగతా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. వరుస పర్యటనలు , యాత్రలు , సభలు , ప్రచారాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే BRS తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..కాంగ్రెస్ (Congress), బిజెపి (BJP) లు సైతం అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉన్నాయి. అలాగే బిజెపి నేతలు సైతం వరుస తెలంగాణ పర్యటనలతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ప్రధాని మోడీ (PM Modi ) రెండుసార్లు తెలంగాణ పర్యటన చేసారు. అలాగే ఈ నెల 10 న కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నారు. ఇలా నేతలంతా బిజీ బిజీ గా మారుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ (Rajiv Kumar) నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు నిన్న (మంగళవారం) హైదరాబాద్ రావడం జరిగింది. హోటల్ తాజ్ కృష్ణాలో ఆ బృందం జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యింది. ఈ భేటీలో బీఆర్ఎస్ తరపున వినోద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్నికల కమిషన్ కు బిఆర్ఎస్ పలు డిమాండ్ ఉంచింది. ఎన్నికల సమయంలో కొంతమంది నేతలు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారని..అలాంటి వారిని అదుపులో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఈసీకి సూచించింది. అలాగే బీఆర్ఎస్ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఉచిత గుర్తింపు జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. బీఆర్ఎస్ కు కారు గుర్తును కేటాయించిన 2004 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కారును పోలి ఉన్న గుర్తులకు వచ్చిన ఓట్ల వివరాలను అధికారులకు వివరించినట్లు తెలిపారు. గతంలో ఆటో , ట్రక్కు గుర్తులను 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించారని తెలిపారు. కారును పోలిన గుర్తులను జాబితా నుంచి తొలగించాలని ఈసీని కోరడం జరిగింది. ఇక రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు తమ పార్టీ అన్నివిధాలా సహాకారం అందిస్తుదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar) ఈసీ అధికారులతో తెలిపారు.

Read Also : Modi Telangana Tour : కేసీఆర్ ను గెలిపించేందుకే ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలు – రేవంత్