Site icon HashtagU Telugu

Delhi Election Results 2025 : తెలంగాణకు తాకిన ఢిల్లీ రాజకీయ సెగ

Minister Ponnam

Minister Ponnam

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు (Delhi Election Results) తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీకి అనుకూలంగా వచ్చిన ఈ ఫలితాల నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయ పార్టీల మధ్య విమర్శల పోటీ మొదలైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Tweet) చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి అభినందనలు తెలుపుతూ ఢిల్లీలో బీజేపీ గెలిచినందుకు కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. అయితే ఇది కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి కారణమైంది. తెలంగాణలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చినప్పటికీ, పార్లమెంటరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయిన బీఆర్ఎస్, ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గెలిచిందంటూ ఆనందించడం అనుచితమని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అధికారంలో పదేళ్లు ఉండి కూడా ఇంతటి ఓటమిని చవిచూసిన బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని వారు పేర్కొన్నారు.

Delhi Election Results : ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం..బీజేపీ నేతలకు శుభాకాంక్షలు : కేజ్రీవాల్‌

మంత్రి పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ మీడియా చైర్మన్ సామా రామ్ మోహన్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ ట్వీట్‌ను తీవ్రంగా ఖండించారు. మోడీ విజయానికి నిజమైన సహాయం చేసింది కవిత అని, ఆమెను కేటీఆర్ అభినందించాలంటూ కామెంట్స్ చేశారు. అలాగే బీజేపీకి 8 సీట్లు అందించడంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణలో బీజేపీని బలపరిచిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఢిల్లీ ఫలితాలను ఆస్వాదించడం విస్మయకరంగా ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీకి మద్దతు ఇస్తున్నారని, ఇదంతా కేసుల మాఫీ కోసమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ-బీఆర్ఎస్ మధ్య దోస్తానీ గురించి ఇప్పటికే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా స్పష్టమైందని విమర్శిస్తున్నారు.